మహేష్ బాబు, పరశురామ్ స్టోరీ లీక్.. ఇదే అంటూ సోషల్ మీడియాలో వైరల్..

సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఈ యేడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. తాజాగా పరశురామ్‌తో నెక్ట్స్ మూవీ చేయనున్నాడు. తాజాగా ఈ సినిమా స్టోరీ ఇదే నంటూ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది.

news18-telugu
Updated: May 29, 2020, 8:37 AM IST
మహేష్ బాబు, పరశురామ్ స్టోరీ లీక్.. ఇదే అంటూ సోషల్ మీడియాలో వైరల్..
మహేష్ పరశురామ్ Photo : Twitter
  • Share this:
సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఈ యేడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత వంశీ పైడిపల్లితో నెక్ట్స్ మూవీ చేయాలనుకున్నాడు. కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్‌ను హోల్డ్‌లో పెట్టి పరశురామ్‌తో నెక్ట్స్ ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నాడు. ఈ సినిమాను తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజైన మే 31న పూజా కార్యక్రమాలతో ప్రారంభించేందకు అంతా రెడీ అయింది. ఎప్పట్లాగే ఈ పూజా కార్యక్రమానికి మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ తన పిల్లలతో కలిసి హాజరయ్యే అయ్యే అవకాశం ఉంది. మహేష్ బాబు రావడం లేదు.  ఎందుకంటే ఆయన తన సినిమా ఓపెనింగ్‌కు రాడు.. అదో సెంటిమెంట్ అంతే. ప్రతీసారి ఆయన భార్య పిల్లలు మాత్రమే వస్తుంటారు. తాను సినిమా ప్రారంభోత్సవానికి వస్తే ప్లాప్ అవుతుందని బలంగా నమ్ముతాడు మహేష్ బాబు.

SSMB27, Shraddha Kapoor, upendra as villain, parasuram film, Mahesh to romance with sara ali khan, Mahesh to romance with keerthy suresh,Mahesh with keerthy suresh,Mahesh Babu with Geetha Govindam director,mahesh babu next movie,mahesh babu next movie update,mahesh babu twitter,vamshi paidipally,vamshi paidipally twitter,mahesh babu vamshi paidipally movie,telugu cinema news,మహేష్ బాబు,వంశీ పైడిపల్లి,వంశీ పైడిపల్లి మహేష్ బాబు సినిమా,గీత గోవిందం,పరుశురామ్,హిమాలయాలకు మహేష్ బాబు, కీర్తి సురేష్, parashuram, సారా అలీ ఖాన్
మహేష్, పరశురామ్ Photo : Twitter


తాజాగా ఈ సినిమా టైటిల్ ‘సర్కార్ వారి పాట’ అంటూ సోషల్ మీడియాలో లీక్ కావడంపై మహేష్ బాబు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ సినిమాను ఇదే టైటిల్  ఖాయం అంటూ వార్తలు కూడా వస్తున్నాయి. టైటిల్ లీక్ విషయమై మహేష్ బాబు తన సన్నిహితుల వద్ద కాస్త  కోపం పడినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే.. బ్యాంకింగ్ వ్యవస్థలోని జరుగుతున్న మోసాలకు సంబంధించిన స్టోరీతో ఈ సినిమా తెరకెక్కనుంది. అందుకే మహేష్ బాబు కూడా స్టోరీ కూడా కొత్తగా ఉండటంతో ఈ సినిమాను యాక్సెప్ట్ చేసినట్టు సమాచారం. సామాజిక సమస్యపై తెరకెక్కతున్న ఈ చిత్రాన్ని పరశురామ్ మహేష్ బాబు ఇమేజ్‌కు తగ్గట్టు కమర్షియల్‌గా తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, మహేష్ బాబు సంయుక్త నిర్మాణంలో తెరకెక్కనుంది. ‘భరత్ అను నేను’, మహర్షి’ , సరిలేరు నీకెవ్వరు వంటి వరుస సక్సెస్‌ల తర్వాత చేస్తోన్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి.
First published: May 29, 2020, 8:37 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading