ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు ..వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమా చేస్తున్నాడు. హీరోగా మహేశ్‌కు ఇది 25వ సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. దిల్ రాజు, సి.అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ మంచి రేటుకే అమ్ముడుపోయాయి. ఇప్పటికే మహేష్ బర్త్ డే సందర్భంగా లాస్ట్ ఇయర్ ఒక టీజర్‌ను రిలీజ్ చేశారు. అప్పటి నుంచి ఈ నుంచి మరో అప్డేట్ లేదు. మధ్యలో శివరాత్రి సందర్భంగా ఒక స్పెషల్ టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించినా..రిలీజ్ చేయలేదు. ఇక ఈ శనివారం ఉగాది సందర్భంగా ఉదయం 9.09 నిమిషాలకు ఈ సినిమా టీజర్ రాబోతున్నట్టు ఈ చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి అఫీషియల్‌గా ప్రకటించాడు.
మరోవైపు ఈసినిమా నుంచి కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ చూస్తుంటే మహేష్ బాబు ఈ సినిమాలో అమెరికాకు చెందిన ఎన్ఆర్ఐ బిజినెస్ మెన్ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. వెనక అమెరికా బ్యాక్ గ్రౌండ్ హెలికాప్టర్ సెటప్ చూస్తుంటే ఈ సినిమలో మహేష్ బాబు క్యారెక్టర్ ఓ రేంజ్లో ఉన్నట్టు తెలుస్తోంది.ఈ సినిమాలో మహేష్ బాబు మరోసారి శ్రీమంతుడుగా తరహా పాత్రలో నటిస్తున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.
అంతేకాదు అమెరికాలో ఓ కార్పోరేట్ కంపెనీ సిఈఓగా ఉన్న మహేశ్.. తన స్నేహితుడి కోసం మాతృదేశం తిరగి వస్తాడని.. ఇక్కడ ఆయన కోసం అన్ని వదిలేసుకుని మామూలు మనిషిలా బతుకుతాడని తెలుస్తుంది.ఆ స్నేహితుడిగా అల్లరి నరేష్ నటిస్తున్నాడు.ఆయన కోసమే అన్నీ వదిలేసుకుని వచ్చి ఉన్న ఊరును కూడా బాగు చేస్తాడనేదే ఈ సినిమా స్టోరీ. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను మే 9న విడుదల చేయనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Allari naresh, Maharshi, Mahesh babu, Mahesh Babu Latest News, Pooja Hegde, Telugu Cinema, Tollywood, Vamsi paidipally