హోమ్ /వార్తలు /సినిమా /

ఇదంతా అభిమానుల దీవెన అంటూ మహేష్ బాబు భావోద్వేగ ట్వీట్..

ఇదంతా అభిమానుల దీవెన అంటూ మహేష్ బాబు భావోద్వేగ ట్వీట్..

మహేష్ బాబు ధన్యవాదాలు (Twitter/Photo)

మహేష్ బాబు ధన్యవాదాలు (Twitter/Photo)

సూపర్ స్టార్  మహేష్ బాబు ప్రుముఖ సామాజిక మాధ్యమైన ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య ఏకంగా 10 మిలియన్లు దాటింది. ఈ సందర్భంగా మహేష్ బాబు తనను ఫాలో అవుతున్న వారితో పాటు అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.

    సూపర్ స్టార్  మహేష్ బాబు ప్రుముఖ సామాజిక మాధ్యమైన ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య ఏకంగా 10 మిలియన్లు దాటింది. అనగా కోటి మంది మహేష్ బాబు ట్విట్టర్ అకౌంట్‌ను ఫాలో అవుతున్నారు. ఈ ఘనత అందుకున్న ఏకైక సౌత్ హీరో మహేష్ బాబు కావడం విశేషం. ఈ సందర్భంగా మహేష్ బాబు తనను  ఫాలో అవుతున్నవారితో పాటు తన అభిమానులకు ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. నన్ను ఫాలో అవుతున్న వారికి కృతజ్ఞత తెలియజేయడానికి 10 మిలియన్ల ధన్యవాదాలు కూడా సరిపోవు అంటూ చెప్పుకొచ్చారు. మహేష్ బాబు విషయానికొస్తే.. సూపర్ స్టార్ కృష్ణ నట వారుసుడిగా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈయన.. ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు తండ్రి బాటలోనే సూపర్ స్టార్ అయ్యాడు. మహేష్ బాబుకు తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. ఈయన ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమాలైన ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్స్ ఉన్నాయి. తాజాగా మహేష్ బాబుకు ట్విట్టర్‌లో 10 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న ఏకైక సౌత్ హీరోగా రికార్డులకు ఎక్కారు.

    మహేష్ బాబు.. ఈ యేడాది ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇపుడు దర్శకుడు పరశురామ్‌తో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను పరశురామ్ అవినీతికి సంబంధించిన ఓ సామాజిక అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించబోతున్నారని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్, నివేదా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Mahesh babu, Sarkaru vaari pata, Telugu Cinema, Tollywood