SUPER STAR MAHESH BABU TAKEN HIGH REMUNARATION FOF SARILERU NEEKEVVARU MOVIE TA
‘సరిలేరు నీకెవ్వరు’ కోసం మహేష్ బాబు షాకింగ్ రెమ్యునరేషన్..
సరిలేరు నీకెవ్వరులో మహేష్ బాబు
ఈ యేడాది వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరే నీకెవ్వరు’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం కోసం మహేష్ బాబు షాకింగ్ పారితోషకం తీసుకున్నట్టు సమాచారం.
ఈ యేడాది వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరే నీకెవ్వరు’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు ఫస్ట్ టైమ్ .. ఒక ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో కనిపించబోతున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 11న విడుదల కానుంది. ఈ సినిమా కోసం మహేష్ బాబు తీసుకున్న పారితోషకం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాకు మహేష్ బాబుకు రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు ముట్టిందనే టాక్ ఫిల్మ్ సర్కిల్స్‌లో వినబడుతోంది. మహేష్ బాబు ఈ సినిమాకు ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాకు మహేష్ బాబు పారితోషకం కాకుండా.. సినిమాకు సంబంధించిన శాటిలైట్ రైట్స్.. డిజిటల్ రైట్స్.. హిందీ డబ్బింగ్ రైట్స్‌ను తీసుకున్నాడనే టాక్ వినబడుతోంది.
సరిలేరు నీకెవ్వరు పోస్టర్స్
ఇప్పటికే ‘సరిలేరే నీకెవ్వరు’ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులను సన్ టీవీ వారు రూ. 30 కోట్లకు కొనుగోలు చేసినట్టు చెబుతున్నారు. ఒక హిందీ డబ్బింగ్ హక్కుల రూపంలో రూ.15 వరకు ముట్టాయట. ఇక ఆడియో అవీ ఇవీ కలిపితే మరో రూ.5 కోట్ల వరకు వచ్చే అవకాశాలున్నాయి. మొత్తానికి ‘సరిలేరే నీకెవ్వరు’ సినిమా కోసం నిర్మాతగా ఉంటూనే.. హీరోగా ఇంత పెద్ద మొత్తంలో పారితోషకం తీసుకుంటూ.. ‘సరిలేరు నీకెవ్వరు’ అనిపించుకుంటున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.