Sakaru Vaari Paata - Mahesh Babu : మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ ఓవర్సీస్ రైట్స్ క్లోజ్ అయిందా.. అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh babu) హీరోగా డైరెక్టర్ పరుశురామ్ పెట్లా దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata) టైటిల్‌తో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటీవల స్పెయిన్‌లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటను చిత్రీకరించిన చిత్రబృందం, తుది షెడ్యూల్‌ను తాజాగా హైదరాబాద్‌లో జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్‌లో ఓ పాటతో పాటు కొన్ని కీలక సన్నివేశాలు చిత్రికరించనున్నారు. ఈ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ పూర్తి కానుంది.
ఇక ఈ సినిమా అంతా అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలకావాల్సి ఉండేది. కానీ ఈ సారి సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలను వస్తున్నాయి. ఓ వైపు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్.. మరోవైపు భీమ్లా నాయక్, ప్రభాస్ రాధే శ్యామ్ ఇలా మూడు సినిమాలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ సినిమాను జనవరి 13న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు గతంలో అధికారికంగా ప్రకటించిగా.. మధ్యలో దర్శకుడు రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా జనవరి 7న విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేయడంతో ఇప్పుడు అంతా తారుమారు అయ్యింది. సర్కారు వారి పాట సమ్మర్ కానుకగా ఏప్రిల్ 1న విడుదల కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలైంది. దీంతో మహేష్ ఫ్యాన్స్ కొంత నిరాశకు గురైయారు.
Sanjay Dutt : మున్నాభాయ్‌కు మరో అరుదైన గౌరవం.. ఆఫ్రికన్ దేశపు బ్రాండ్ అంబాసిడర్‌గా సంజయ్ దత్..
అయితే ఈ నిర్ణయం సినిమా మంచి కోసమే చిత్ర దర్శక నిర్మాతలు తీసుకున్నారట. ఒకేసారి మూడు భారీ సినిమాలు విడుదల వలన ఈ ప్రభావం సినిమా కలెక్షన్స్ మీద కూడా పడే అవకాశం ఉండడంతో ‘సర్కారు వారి పాట’ నిర్మాతలు ఈ ఆలోచన చేశారట. ఈ నేపథ్యంలోనే సర్కారు వారి పాట విడుదలను వాయిదా వేశారట. తాజాగా ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోయినట్టు సమాచారం. మొత్తంగా ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ రూ. 15 కోట్లకు డీల్ క్లోజ్ అయినట్టు సమాచారం.
సినీ ఇండస్ట్రీని ఏలిన రియల్ లైఫ్ అక్కా చెల్లెల్లు.. స్టార్ హీరోయిన్స్ ఎవరెరున్నాంటే..
సర్కారు వారి పాట షూటింగ్ విషయానికి వస్తే.. దుబాయ్ లో తొలి షెడ్యూల్ షూటింగును పూర్తి చేసిన సర్కారు వారి పాట టీమ్, ఆ తరువాత గోవాలో ఓ షెడ్యూల్ ను కూడా పూర్తిచేసింది. ఈ రెండు షెడ్యూల్స్ లోను భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. మధ్యలో కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ కాస్త లేటైన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో విలన్‌గా సముద్రఖని కీలక పాత్రలో కనిపించనున్నారు. సముద్ర ఖని తెలుగుతో పాటు తమిళంలో పలు సినిమాల్లో నటించి అలరించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ (Keerthy suresh) హీరోయిన్’గా నటిస్తున్నారు.
Raja Vikramarka Movie Review : కార్తికేయ ‘రాజా విక్రమార్క’ మూవీ రివ్యూ..
ఈ సినిమా (Sarkaru Vaari Paata) కథ విషయానికి వస్తే.. భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన ఓ భారీ కుంభకోణం చుట్టూ కేంద్రీకృతమైందని తెలుస్తోంది. సినిమాలో హీరో ఫాదర్ పాత్ర బ్యాంకు ఉన్నత అధికారి అని తెలుస్తోంది.
ఈ సినిమా సోషల్ మెసేజ్‌తో వస్తోందట. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడిన ఆపవాదును ఎలా పోగొట్టాడు అనేది కథాంశంగా ఉండనున్నందని సమాచారం. ఇక ఈ సినిమాలో మహేష్ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రం టెక్నికల్ సిబ్బంది విషయానికి వస్తే.. మధి కెమెరా మెన్‌గా చేస్తుండగా.. థమన్ (S.SThaman) సంగీతాన్ని అందిస్తున్నారు. మార్తండ్ కె వెంకటేశ్ ఎడిటింగ్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Keerthy Suresh, Mahesh Babu, ParasuRam, Sarkaru Vaari Paata, Tollywood