Mahesh Babu - Okkadu@19Years : సూపర్ స్టార్ మహేష్ బాబు ‘ఒక్కడు’ మూవీ విడుదలై 19 యేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు. మహేష్ బాబు.. సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకున్నారు. ఇక కెరీర్ తొలినాళ్లలో మహేష్ బాబు కెరీర్లో ‘ఒక్కడు’ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. మహేష్ బాబు తొలి సినిమా ‘రాజకుమారుడు’తో సక్సెస్ అందుకున్న .. ఆ తర్వాత ‘మురారి’తో నటుడిగా మరో మెట్టు పైకెక్కాడు మహేష్ బాబు. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మురారి’ హీరోగా తొలి సాలిడ్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన కౌబాయ్ చిత్రం ‘టక్కరి దొంగ’ అనుకున్నంత రేంజ్లో సక్సెస్ కాలేదు. ఇక దివంగత శోభన్ దర్శకత్వంలో చేసిన ‘బాబీ’ సినిమా డిజాస్టర్స్‌గా నిలిచాయి.
హిట్ కొట్టాల్సిన పరిస్థితుల్లో మహేష్ బాబు.. గుణ శేఖర్ దర్శకత్వంలో ‘ఒక్కడు’ సినిమా చేసారు. ఈ మూవీ 19 యేళ్ల క్రితం 15 జనవరి 2003లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ సినిమాను సుమంత ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్లో యం.యస్.రాజు నిర్మించారు. గుణశేఖర్ డైరెక్ట్ చేసారు. ఈ సినిమాకు మణిశర్మ అందించిన సంగీతం పెద్ద ఎస్సెట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన భూమిక హీరోయిన్గా నటించింది. విలన్‌గా ప్రకాష్ రాజ్ నటించారు.
Superstar @urstrulyMahesh’s one of the cult classic film #Okkadu completes 19 Years today ❤️
2003లో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. హీరోగా మహేష్ బాబుకు ఈ సినిమాతో మాస్ ఇమేజ్ వచ్చింది. ఈ సినిమాకు పోటీగా ఎన్టీఆర్.. ‘నాగ’తో పాటు రవితేజ.. ‘ఈ అబ్బాయి చాలా మంచోడు’ .. శ్రీకాంత్, వేణుల ‘పెళ్లాం ఊరెళితే’ చిత్రాలు విడుదలయ్యాయి. ఇంత పోటీలో మహేష్ బాబు ‘ఒక్కడు’ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. శ్రీకాంత్, వేణుల ‘పెళ్లాం ఊరెళితే’ సినిమా మాత్రం సూపర్ హిట్టైయింది. ఎన్టీఆర్.. ‘నాగ’, రవితేజ.. ‘ఈ అబ్బాయి చాలా మంచోడు’ చిత్రాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి.
మహేష్ బాబు ‘ఒక్కడు’ సినిమా విషయానికొస్తే.. రూ. 11 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ మూవీ.. ఓవరాల్‌గా రూ. 21.70 కోట్ల షేర్ రాబట్టింది. బయ్యర్స్‌కు రూ. 10.70 కోట్ల లాభాలు తీసుకొచ్చింది. ఈ సినిమా అప్పట్లోనే టాలీవుడ్ హైయ్యెస్ట్ బ్లాక్ బస్టర్స్‌లో నాల్గో స్థానంలో నిలిచింది. ఈ సినిమాతో మహేష్ బాబు స్టార్ హీరోగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఎం.ఎస్.రాజు సీక్వెల్ రెడీ కథను రెడీ చేస్తున్నట్టు ప్రకటించారు.
సీక్వెల్ కథను యం.యస్.రాజు రెడీ చేసినా.. మహేష్ బాబు ఈ స్టోరీ విని ఓకే చెబుతాడా ? లేదా అనేది చూడాలి. టాలీవుడ్లో సీక్వెల్స్ నడిచిన దాఖలాలు లేవు. మరి సెంటిమెంట్స్‌ను ఎక్కువగా నమ్మె మహేష్ బాబు.. ఒకపుడు తనను స్టార్ హీరోను చేసిన ఈ సూపర్ హిట్ సినిమా సీక్వెల్‌కు ఓకే చెబుతాడా లేదా అనేది చూడాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.