ఉప్పెన టీంకు మహేష్ బాబు కంగ్రాట్స్ (Mahesh Babu Uppena)
Uppena - Mahesh Babu: ఇండస్ట్రీలో మహేష్ బాబుకు మంచి అలవాటు ఉంది. ఏదైనా సినిమా విజయం సాధించినపుడు తన పర బేధం లేకుండా వాళ్లను అభినందిస్తాడు. గతంలో చాలా సినిమాలకు అలా చేసాడు సూపర్ స్టార్. చిన్న సినిమాలకు కూడా ఒక్కోసారి..
ఇండస్ట్రీలో మహేష్ బాబుకు మంచి అలవాటు ఉంది. ఏదైనా సినిమా విజయం సాధించినపుడు తన పర బేధం లేకుండా వాళ్లను అభినందిస్తాడు. గతంలో చాలా సినిమాలకు అలా చేసాడు సూపర్ స్టార్. చిన్న సినిమాలకు కూడా ఒక్కోసారి మహేష్ బాబు ఇచ్చిన ప్రమోషన్ చాలా హెల్ప్ అయింది. ఇప్పుడు ఉప్పెన సినిమా విషయంలో కూడా ఇదే చేసాడు సూపర్ స్టార్. ఈ సినిమా సాధించిన విజయం గురించి మహేష్ బాబుకు కూడా వినిపించింది. ఎక్కడో దుబాయ్‌లో షూటింగ్ చేసుకుంటున్న మహేష్ బాబు.. ఉప్పెన సినిమా విజయం గురించి తెలుసుకుని ట్వీట్ చేసాడు. అందుకే దర్శక నిర్మాతలతో పాటు ఈ సినిమాలో నటించిన నటీనటులకు కూడా ట్విట్టర్ వేదికగా కంగ్రాట్స్ చెప్పాడు సూపర్ స్టార్. ఉప్పెన గురించి చాలా చాలా మంచి విషయాలు వింటున్నా.. ఇంత అద్భుతమైన విజయం సాధించడం ఆనందంగా ఉంది.. ఈ సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికి నా తరఫున అభినందనలు తెలుపుతున్నా.. ముఖ్యంగా ఈ సినిమాతో పరిచయమైన వైష్ణవ్ తేజ్, కృతి శెట్టికి స్పెషల్ కంగ్రాట్స్.. ఈ సినిమాను చూడటానికి వేచి చూస్తున్నాను అంటూ ట్వీట్ చేసాడు మహేష్ బాబు. దానికి మైత్రి మూవీ మేకర్స్, విజయ్ సేతుపతి, బుచ్చిబాబు సన, సుకుమార్ రైటింగ్స్‌ను ట్యాగ్ చేసాడు. ఉప్పెన సినిమాపై మహేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.
ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా షూటింగ్లో ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ దుబాయ్‌లో జరుగుతుంది. అక్కడే భారీ షెడ్యూల్ ప్లాన్ చేసాడు దర్శకుడు పరశురామ్. ఈ సినిమా షూటింగ్ కోసం వెళ్లిన మహేష్ బాబు.. కుటుంబంతో పాటు అక్కడే గడుపుతున్నాడు. షూటింగ్లో ఏ మాత్రం ఖాళీ దొరికినా వెంటనే ఉప్పెన చూడాలని ఎదురు చూస్తున్నాడు సూపర్ స్టార్. ఇదిలా ఉంటే ఉప్పెన 3 రోజుల్లోనే 28 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.