ఈ యేడాది ‘మహర్షి’ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న మహేష్ బాబు.. అదే ఊపులో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. మరోవైపు ఈ సినిమాతో ఒకప్పటి లేడీ అమితాబ్ విజయశాంతి నటిగా రీ ఎంట్రీ ఇస్తోంది. రీసెంట్గా విజయశాంతి ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. తాజాగా మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా నటి విజయశాంతి పై ఓ ట్వీట్ చేశారు. సరిగ్గా 30 ఏళ్ల క్రితం వచ్చిన ‘కొడుకు దిద్దిన కాపురం’లో విజయశాంతి, తను తల్లి కొడుకులుగా నటించిన సంగతి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ సినిమాను కృష్ణ దర్శకత్వం వహించడం విశేషం. సరిగ్గా 30 ఏళ్ల తర్వాత విజయశాంతి గారితో కలిసి నటిస్తున్నాను. జీవితం అనేది నిజంగా చక్రం వంటిది అని ట్వీట్ చేసారు.
ఈ ట్వీట్‌కు స్పందించిన విజయ శాంతి.. మహేష్ బాబు పై ప్రశంసలు కురిపించారు. 1989లో మా కాంబినేషన్లో ప్రారంభం కావడానికి ముందే.. ఇదే రోజు 1980లో విజయ నిర్మల దర్శకత్వంలో కృష్ణ గారితో ‘కిలాడీ కృష్ణుడు’ చిత్రంలో జంటగా నటించడంతో నా సినీ జీవితం మొదలైంది. కళ అనేది అనంతం. అది మీలాంటి వారి వల్ల ఒక భ్రమణం చేస్తుంది. వారసత్వం ఒక విలువైన సంపద. అని విజయశాంతి తన ట్వీట్ చేసింది.ఈ సినిమాలో విజయ శాంతి మెడికల్ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ పాత్రలో కనిపించనుందని సమాచారం.