సీఎం పోస్ట్ పై మహేష్ బాబు సంచలన వ్యాఖ్యలు.. ఈ రాష్ట్రాన్ని వాళ్లే కాపాడాలంటూ..

 ఈ యేడాది మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై సంచలన విజయం సాధించింది. తాజాగా మహేష్ బాబు రీసెంట్‌గా ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.

news18-telugu
Updated: February 18, 2020, 3:54 PM IST
సీఎం పోస్ట్ పై మహేష్ బాబు సంచలన వ్యాఖ్యలు.. ఈ రాష్ట్రాన్ని వాళ్లే కాపాడాలంటూ..
మహేష్ బాబు (Twitter/Photo)
  • Share this:
ఈ యేడాది మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై సంచలన విజయం సాధించింది. ఈచిత్రంలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. మరోవైపు సీనియర్ హీరోయన్ విజయశాంతి ఈ చిత్రంతో నటిగా రీ ఎంట్రీ ఇచ్చింది.  ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 150 కోట్ల షేర్ వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు మహేష్ బాబు కెరీర్‌లో ఎక్కువ వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా సక్సెస్ తర్వాత మహేష్ బాబు కుటుంబంతో కలిసి అమెరికాకు వెళ్లాడు. అక్కడ మోకాలికి శస్త్ర చికిత్స తీసుకున్నట్టు సమాచారం. ఆ తర్వాత వచ్చి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కొత్త సినిమాను స్టార్ట్ చేయనున్నాడు. ఈ  సినిమాను మహేష్ బాబుతో కలిసి దిల్ రాజు నిర్మించనున్నాడు. తాజాగా మహేష్ బాబు రీసెంట్‌గా ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ఈ సందర్భంగా మీరు ఒక రోజు సీఎం అయితే ఏం చేస్తారు ? అనే ప్రశ్నుక సమాధానం చెబుతూ నేను సీఎం అయితే రాష్ట్రాన్ని దేవుడే కాపాడాలన్నారు. ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమాలపైనే ఉంది. రాజకీయాలపై లేదన్నారు.రాజకీయాలపై ఆసక్తి లేదన్న మహేష్ బాబు.. గతంలో కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అను నేను’ సినిమాలో ముఖ్యమంత్రి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే కదా.

Maharshi movie 1st day WW Collection report.. Will Mahesh Babu create new records pk.. భారీ సినిమాలు విడుద‌ల అవ్వ‌క చాలా రోజులు అవుతుంది. సంక్రాంతికి వ‌చ్చిన సినిమాల త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ళ్లీ స్టార్ హీరోల సినిమాలు రాలేదు. మ‌ధ్య‌లో కొన్ని బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు వ‌చ్చినా కూడా రికార్డులు తిర‌గ‌రాసే స‌త్తా మాత్రం వాటికి లేవు. maharshi movie review,maharshi review,maharshi movie collections,mahesh babu maharshi,maharshi box office collection,maharshi first day collections,#maharshi,maharshi collections,maharshi box office collections,maharshi first day box office collections,maharshi movie censor review,maharshi movie public talk,maharshi,maharshi movie,maharshi censor review,maharshi telugu movie review,maharshi trailer,maharshi movie public review,maharshi movie review and rating,maharshi public review,mahesh babu maharshi,maharshi movie rating,maharshi teaser review,maharshi songs,maharshi movie songs,maharshi public talk,telugu cinema,మహర్షి సినిమా,మహర్షి సినిమా కలెక్షన్స్,మహర్షి సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్,మహేశ్ బాబు మహర్షి సినిమా,తెలుగు సినిమా
‘మహర్షి’,‘భరత్ అను నేను’లో సూపర్ స్టార్ మహేష్ బాబు


ఇక వంశీ పైడిపల్లితో చేయబోయే సినిమా విషయానికొస్తే.. ఈ చిత్రంలో మహేష్ బాబు గ్యాంగ్ స్టర్ పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. అప్పట్లో రజినీకాంత్ నటించిన ‘భాషా’ తరహాలో ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు ద్విపాత్రాభినయం (డ్యూయల్ రోల్) లో నటించనున్నట్టు సమాచారం. మహేష్ బాబు కెరీర్ విషయానికొస్తే.. చిన్నపుడు తన తండ్రి కృష్ణ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కొడుకు దిద్దిన కాపురం’ సినిమాలో డ్యూయల్ రోల్లో నటించాడు. ఆ తర్వాత ఎస్.జే.సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ‘నాని’ చిత్రంలో చివరి సన్నివేశంలో తండ్రి కొడుకులుగా కనిపించి కాసేపు ప్రేక్షకులను ఆనంద పరిచాడు.

First published: February 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు