Mahesh Babu: సినిమాల్లోనే కాదు తన చర్యలతో రియల్ లైఫ్‌లోనూ హీరో అనిపించుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. చిన్న పిల్లల పాలిట మాత్రం దేవుడిలా నిలుస్తున్నారు మహేష్. ఎన్నో గుండెలను ఆయన బ్రతికిస్తున్నారు. ఆంధ్ర హాస్పిటల్స్‌తో కలిసి మహేష్ బాబు చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయిస్తున్నారు. పేద కుటుంబాల్లో వెలుగులు నింపడానికి.. అనారోగ్యంతో బాధ పడుతున్న చిన్నారులను బ్రతికించడానికి ముందుకొస్తున్నాడు సూపర్ స్టార్. ఈ క్రమంలో తాజాగా మరో గుండెను బ్రతికించారు మహేష్ బాబు. ఈ విషయాన్ని మహేష్ సతీమణి నమ్రతా శిరోద్కర్ తన సోషల్ మీడియాలో వెల్లడించారు.
మరొకరు కోలుకున్నాను. టెట్రాలజీ ఆఫ్ ఫెలాట్ సర్జరీకి వెళ్లిన షేక్ రిహాన్ డిశ్చార్జ్ అయ్యాడని వినడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. అతడు ఆరోగ్యంగా ఉండాలని మా ప్రార్థనలు కొనసాగుతూనే ఉంటాయి. ఆంధ్ర హాస్పిటల్స్‌లోని హెల్త్ కేర్ ఎక్స్పర్ట్లకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ . మహేష్ బాబు ఫర్ సేవింగ్ హార్ట్స్ అని నమత్ర కామెంట్ పెట్టారు.
View this post on Instagram
ఇక ఈ సర్జరీతో ఇప్పటివరకు 1020 మంది పిల్లల గుండెలను కాపాడారు మహేష్. దీంతో ఆయనపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్యాన్స్ అయితే దీన్ని షేర్ చేసుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ హీరో రీల్‌గానే కాదు రియల్‌గా కూడా హీరో వారు కామెంట్లు పెడుతున్నారు. మిగిలిన హీరోల అభిమానులు సైతం ఈ విషయంలో మహేష్‌పై ప్రశంసలు కురిపిస్తూ యూ ఆర్ గ్రేట్ సర్ అని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mahesh babu, Namratha Shirodkar