Mahesh Babu: మరో చిన్నారి ప్రాణం కాపాడిన సూపర్ స్టార్ మహేష్ బాబు..

మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన మార్కెట్ రేంజ్ 100 కోట్లు దాటిపోయింది. యావరేజ్ టాక్ తెచ్చుకున్న మహర్షి లాంటి సినిమాలు కూడా మహేష్ స్టామినాతో 100 కోట్ల మైలురాయిని అందుకున్నాయి.

Mahesh Babu: సినిమాల్లో మాత్రమే కాదు బయట కూడా రియల్ హీరో అనిపించుకుంటున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu). ఈయన కృషితో ఎంతోమంది చిన్నారుల ప్రాణాలు నిలబడుతున్నాయి. ఇప్పటికే దాదాపు 1000 మందికి పైగా పిల్లల ప్రాణాలు కాపాడాడు మహేష్..

  • Share this:
సినిమాల్లో మాత్రమే కాదు బయట కూడా రియల్ హీరో అనిపించుకుంటున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈయన కృషితో ఎంతోమంది చిన్నారుల ప్రాణాలు నిలబడుతున్నాయి. ఇప్పటికే దాదాపు 1000 మందికి పైగా పిల్లల ప్రాణాలు కాపాడాడు మహేష్ బాబు. తన వంతు సాయంగా అందరికీ తోచినంత వైద్యం అందిస్తున్నాడు ఈయన. తాజాగా మరో చిన్నారి ప్రాణం కూడా నిలబెట్టాడు సూపర్ స్టార్. అరుదైన గుండె జబ్బుతో బాధ పడుతున్న ఓ బాబుకి ఆయన ట్రస్ట్ ద్వారా శస్త్ర చికిత్స అందించారు. ప్రస్తుతం ఈ చిన్నారి పరిస్థితి నిలకడగా ఉంది. ఇదే విషయాన్ని మహేష్ బాబు టీమ్‌తో పాటు ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్ కూడా సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. సర్జరీ తర్వాత బాబును కొన్ని రోజులు అబ్జర్వేషన్‌లో ఉంచి.. తాజాగా డిశ్చార్జి కూడా చేసారని పేర్కొన్నారు. ఆ బాబు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు నమ్రత శిరోద్కర్. ఈ ఆపరేషన్‌ చేసిన ఆంధ్ర హాస్పిటల్స్ యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు.

ఆంధ్రా హాస్పిటల్స్ సౌజన్యంతోనే ఇవన్నీ చేస్తున్నాడు మహేష్ బాబు. మొన్నటికి మొన్న తన సొంతూరు బుర్రిపాలెంలో కూడా కోవిడ్ సెకండ్ డోస్ వేయించాడు. అప్పుడు కూడా ఈ ఆంధ్రా హాస్పిటల్స్ సపోర్ట్‌తోనే చేసాడు. మహేష్ చేసే ప్రతీ కార్యక్రమంలోనూ ఆంధ్రా హాస్పిటల్స్ ఉన్నారు.

#MBforSavingHearts అనే హ్యాష్‌ ట్యాగ్‌ జతచేసి పోస్ట్ చేసారు నమ్రత శిరోద్కర్. ఇప్పటికే మహేష్ చొరవతో దాదాపు 1100 మంది పిల్లల ప్రాణాలు నిలబడ్డాయి. మా కుటుంబం చాలా పెద్దది అంటూ నమ్రత ప్రతీసారి చెప్తూనే ఉంటారు. సూపర్ స్టార్ సాయాన్ని సోషల్ మీడియా వేదికగా పలువురు అభినందిస్తున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published: