Home /News /movies /

SUPER STAR MAHESH BABU SARKARU VAARI PAATA US AMERICA BOOKNG OPENS TODAY TA

Sarkaru Vaari Paata :మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ బాక్సాఫీస్ యుద్దం మొదలు.. అపుడే యూఎస్ బుకింగ్స్ ఓపెన్..

‘సర్కారు వారి పాట’ మూవీ యూఎస్ బుకింగ్స్ ఓపెన్ (Twitter/Photo)

‘సర్కారు వారి పాట’ మూవీ యూఎస్ బుకింగ్స్ ఓపెన్ (Twitter/Photo)

Sarkaru Vaari Paata :మహేష్ బాబు అభిమానులకు మరో శుభవార్త.. ‘సర్కారు వారి పాట’ సినిమాకు సంబంధించిన యూఎస్ బుకింగ్స్ ఓపెన్ చేశారు.

  Mahesh Babu - Sarkaru Vaari Paata | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ పరుశురామ్ పెట్లా దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’  (Sarkaru Vaari Paata) సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈ సినిమా షూటింగ్ దాదాపు కంప్లీటైంది. రేపో మాపో.. ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేయనున్నారు చిత్ర యూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుంచి  నుంచి కళావతి అనే సాంగ్‌‌ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. థమన్ స్వరపరిచిన ఈ మెలోడీ సాంగ్ ఇప్పటి వరకు ఈ సినిమా యూట్యూబ్‌లో 150 మిలియన్ వ్యూస్ రాబట్టి దూసుకుపోతోంది.  ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాయగా.. సిద్ శ్రీరామ్ పాడారు.  థమన్ (Thaman) సంగీతం అందించారు. పాటలో విజువల్స్ బాగున్నాయి. ఈ పాట విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

  ‘సర్కారు వారి పాట’  సినిమా నుంచి విడుదల చేసిన రెండో పెన్నీ సాంగ్ (Penny Music Video) కు మంచి రెస్పాన్స్ వస్తోంది.  ఈ పాట సూపర్ స్టైలీష్‌గా ఉంటూ.. ఇన్‌స్టాంట్ హిట్‌గా నిలిచింది. విడుదలైందో లేదో రికార్డ్స్ వ్యూస్‌ను దక్కించుకుంటోంది. ఇప్పటికే ఈ (Penny Music Video) పాట ఇప్పటికే 28 మిలియన్ వ్యూస్‌ని క్రాస్ చేసి ప్రభంజనం సృష్టిస్తోంది. ఇక పాట విషయానికి వస్తే.. సాంగ్ మేకింగ్ గాని విజువల్స్ ఒక రేంజ్‌లో ఉంటే.. మహేష్ లుక్స్ మరో రేంజ్‌లో ఉన్నాయి.దీనికి తోడు సాంగ్ లిరిక్స్ చాలా ట్రెండీగా ఉంటూ తెగ ఆకట్టుకుంటున్నాయి. మహేష్ కూతురు సితార ఘట్టమనేని చేసిన స్టైలిష్ పెర్ఫామెన్స్ మరో హైలైట్‌గా ఉంది. నాకాష్ ఆజీజ్ పాడగా... అనంత శ్రీరామ్ రాశారు. తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన టైటిల్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

  Pawan Kalyan - Kushi@21 Years: 21 యేళ్ల పవన్ కళ్యాణ్ ‘ఖుషీ’ మూవీ.. సాధించిన రికార్డులు..


  ఇక ఈ (Sarkaru Vaari Paata)  సినిమా  మే 12, 2022 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి యూఎస్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. విడుదలకు 15 రోజుల ముందే బుకింగ్స్ ఓపెన్ అవడం మామలు విషయం కాదు.

  మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ యూఎస్ బుకింగ్స్ ఓపెన్


  మహేష్ బాబు మే నెలలో విడుదలైన  గత చిత్రాల విషయానికొస్తే..  ‘నాని’, ’నిజం’, బ్రహ్మోత్సవం’, ’స్పైడర్’ మే నెలలో విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే ’మహర్షి’ సినిమా మినహాయింపు అనే చెప్పాలి. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని కేవలం తెలుగులోనే కాకుండా.. హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో ఒకేసారి ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సిఉంది.  ఈ సినిమా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్, సినిమా చేయనున్నారు. ఆ తర్వాత రాజమౌళి సినిమా ఉండనే ఉంది. ఈ రకంగా ‘సర్కారు వారి పాట’ సినిమాతో తొలిసారి ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తే.. రాబోయే సినిమాలకు హెల్ప్ అవుతుందని మేకర్స్ ఆలోచిస్తున్నారట.

  Tollywood Top Most Profitable Movies : RRR సహా తెలుగులో ఎక్కువ లాభాలు తీసుకొచ్చిన టాప్ సినిమాలు ఇవే..


  ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ (Keerthy suresh) హీరోయిన్’గా నటించింది. ఈ సినిమా (Sarkaru Vaari Paata) కథ విషయానికి వస్తే.. భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన ఓ భారీ కుంభకోణం చుట్టూ కేంద్రీకృతమైందని తెలుస్తోంది. సినిమాలో హీరో ఫాదర్‌ పాత్ర బ్యాంకు ఉన్నత అధికారి అని తెలుస్తోంది.ఈ సినిమా సోషల్ మెసేజ్‌తో వస్తోందట. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడిన ఆపవాదును ఎలా పోగొట్టాడు అనేది కథాంశంగా ఉండనున్నందని సమాచారం. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రం టెక్నికల్ సిబ్బంది విషయానికి వస్తే.. మధి కెమెరా మెన్‌గా చేస్తుండగా.. థమన్‌ (S.SThaman) సంగీతాన్ని అందిస్తున్నారు. మార్తాండ్‌ కె వెంకటేష్ ఎడిటింగ్‌ చేస్తున్నారు.
  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Keerthy Suresh, Mahesh Babu, Sarkaru Vaari Paata, Tollywood

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు