SUPER STAR MAHESH BABU SARKARU VAARI PAATA MOVIE HOW MUCH COLLECT TO BREK EVEN TA
Sarkaru Vaari Paata : ‘సర్కారు వారి పాట’ బ్రేక్ ఈవెన్‌కు ఎంత దూరంలో ఉంది.. బాక్సాఫీస్ దగ్గర ఇంకా ఎంత రాబట్టాలంటే..
సర్కారు వారి పాట బ్రేక్ ఈవెన్‌కు ఎంత దూరంలో ( Photo : Twitter)
Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా థియేటర్స్‌లో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకొంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు ఎంత దూరంలో ఉందంటే..
Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా థియేటర్స్‌లో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకొంది. రెండో వారంలో కూడా ఈ సినిమా డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన మూవీ ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ట్రేడ్‌లో భారీ అంచనాలే మధ్య చక్కని వసూళ్లనే రాబట్టింది. హీరోగా మహేష్ బాబుకు అమెరికాలో 1 మిలియన్ క్రాస్ చేసిన చిత్రాల్లో 11వ ది. యూఎస్‌లో ఎక్కువ 1 మిలియన్ డాలర్స్ వసూళు చేసిన చిత్రాల్లో మహేష్ బాబు చిత్రాలదే అగ్ర స్థానం. తాజాగా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 2.3 మిలియన్స్ పైగా యూఎస్ డాలర్స్ వసూళు చేసి సత్తా చూపెట్టింది.
ఇక ఈ సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్‌ను బట్టి ప్రపంచ వ్యాప్తంగా 11రోజుల్లో ఈ సినిమా ఇప్పటికే రూ. 100 కోట్ల షేర్ అందుకుంది. మహేష్ బాబు చిత్రాల్లో రూ. 100 కోట్ల షేర్ అందుకున్న నాల్గో చిత్రంగా ‘సర్కారు వారి పాట’ సినిమా నిలిచింది. రెండో వీకెండ్లో ‘సర్కారు వారి పాట’ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లో కలెక్షన్స్ విషయానికొస్తే.. తెలంగాణ + ఆంధ్రప్రదేశ్ : రూ. 87.43 కోట్లు / (రూ. 131.45 కోట్లు) రాబట్టింది.
తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ + ఆంధ్రప్రదేశ్ కలిపి రూ. 87.43 కోట్లు (రూ. 131.45 కోట్ల గ్రాస్ ) / రూ. 96.50 కోట్లు మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఒక్క ఏరియాలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోలేదు.
కర్ణాటక + రెస్టాఫ్ భారత్ : రూ. 6.62 కోట్లు / రూ. 11.50 కోట్లు
ఓవర్సీస్ : రూ. 12.25 కోట్లు / రూ. 11 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 106.30 కోట్లు (రూ. 170.65 కోట్లు గ్రాస్) / రూ 120 కోట్లు మొత్తంగా ఈ సినిమా రూ. 16.32 కోట్లు వస్తే కానీ బ్రేక్ ఈవెన్ కాదు.
ఓవరాల్‌గా ప్రపంచ వ్యాప్తంగా రూ. 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 104.68 కోట్ల షేర్ రాబట్టింది. మరో రూ. 14.70 వస్తే కానీ బ్రేక్ ఈవెన్ కాదు. ఈ సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్‌తో ఈ వీకెండ్ వరకు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంటుందని ట్రేడ్ వర్గాలు భావించాయి. మరి ఈ శుక్రవారం నుంచి థియేటర్స్‌లో ఎఫ్ 3 మూవీ సందడి చేయనుంది. ఆ సినిమా విడుదల తర్వాత సర్కారు వారి పాట బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మాయ చేస్తుందో చూడాలి.
ఈ సినిమాలో కీర్తి సురేష్ (Keerthy suresh) హీరోయిన్’గా నటించారు. ఇందులో కీర్తి సురేష్ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా (Sarkaru Vaari Paata) కథ విషయానికి వస్తే.. భారత బ్యాంకింగ్ రంగంలో వేల కోట్లు ఎగవేసిన ఓ రాజకీయ నేతలు, బడా బాబులపై తెరకెక్కించారు. ఈ చిత్రం టెక్నికల్ సిబ్బంది విషయానికి వస్తే.. మధి కెమెరా మెన్‌గా చేస్తుండగా.. థమన్ (S.SThaman) సంగీతాన్ని అందిస్తున్నారు. మార్తండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్, రాజమౌళి సినిమాల్లో నటించనున్నారు.ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. శాటిలైట్ హక్కులను స్టార్ మా దక్కించుకున్నట్టు సమాచారం.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.