హోమ్ /వార్తలు /సినిమా /

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ఖాతాలో మరో అరుదైన రికార్డు..

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ఖాతాలో మరో అరుదైన రికార్డు..

మహేష్ బాబు (Mahesh Babu)

మహేష్ బాబు (Mahesh Babu)

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu)  ఖాతాలో మరో అరుదైన రికార్డు నమోదైంది. వివరాల్లోకి వెళితే..

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu)  ఖాతాలో మరో అరుదైన రికార్డు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ (Prarasuram) దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata) సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. రీసెంట్‌గా మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్(Keerthy Suresh) నటిస్తోంది.  ఈ సినిమాలో మహేష్ బాబు బ్యాంక్ మేనేజర్‌గా పాత్రలో కనిపించనున్నారు. మరోవైపు మహేష్ బాబు మరో పాత్రలో కూడా కనిపించనున్నట్టు సమాచారం. తాజాగా ఈ సినిమా తెలుగులో మోస్ట్ ట్వీటెడ్ హ్యాష్ ట్యాగ్ మూవీస్‌లో మొదటి స్థానంలో నిలిచింది. దక్షిణాది విషయానికొస్తే.. ఈ సినిమా మూడో ప్లేస్‌లో నిలిచింది. అజిత్ హీరోగా నటిస్తోన్న ‘వాలిమై’ ఎక్కువ మంది ట్వీట్ చేసిన సినిమాగా మొదటి స్థానంలో నిలిచింది. విజయ్ హీరోగా నటించిన ‘మాస్టర్’ రెండో ప్లేస్‌లో నిలిచింది. మహేష్ బాబు నటిస్తోన్న ‘సర్కారు వారి పాట’ మూడో స్థానంలో నిలిచింది.

తెలుగు వరకు మాత్రం ఎక్కువ మంది ట్వీట్ చేసిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.  జనవరి 1 నుంచి  జూన్ 30వ తేది వరకు దక్షిణాది సినిమా రంగానికి సంబంధించి  ట్విట్టర్‌ విడుదల చేసిన జాబితాలో సర్కారు వారి పాట ఎక్కువ మంది ట్వీట్ చేసిన సినిమాగా మూడో స్థానంలో నిలిచింది. ‘సర్కారు వారి పాట’ సినిమాలో కీర్తి సురేష్ కూడా బ్యాంక్ ఉద్యోగి పాత్రలో నటించనున్నారు.

‘సర్కారు వారి పాట’లో మహేష్ బాబు (Twitter/Photo)

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఈ సినిమా సోషల్ మెసేజ్‌తో తెరెక్కిస్తున్నారు. భారత బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల చుట్టూ కథ సాగుతోందని.. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడ్డ ఆపవాదును ఎలా పోగొట్టాడు అనేది కథాంశంగా ఉండనున్నందని సమాచారం.

Salman Khan : సల్మాన్ అయితే నాకేంటి.. ? ముంబై ఎయిర్‌పోర్ట్‌లో సల్లూ భాయ్‌కు చుక్కలు చూపించిన యువ అధికారి..


Chiranjeevi : లూసీఫర్, వేదాలం కాకుండా... చిరంజీవి ఖాతాలో మరో సూపర్ హిట్ రీమేక్..

రీసెంట్‌గా  ఈ సినిమా గోవాలో తిరిగి ప్రారంభమైంది. అది కూడా ఇంటెన్సివ్ ఫైట్ సీన్‌ను చిత్రీరిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయనున్నారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ ఈ సినిమా నిర్మిస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన మరోసారి పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ‘సర్కారు వారి పాట’ తర్వాత ఈ సినిమా పట్టాలెక్కనుంది. మరోవైపు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ఓ సినిమా చేయనున్నారు. ఆ సినిమా వచ్చే యేడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు అల్లు అరవింద్ నిర్మిస్తోన్న ప్యాన్ ఇండియా ‘రామాయణం’లో మహేష్ బాబు శ్రీరాముడి పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది.

First published:

Tags: Mahesh Babu, Sarkaru Vaari Paata

ఉత్తమ కథలు