Home /News /movies /

SUPER STAR MAHESH BABU SARKARU VAARI PAATA KALAAVATHI FULL VIDEO SONG RELEASED TA

Sarkaru Vaari Paata : మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ నుంచి కళావతి ఫుల్ వీడియో సాంగ్ విడుదల..

సర్కారు వారి పాట ‘కళావతి’ ఫుల్ సాంగ్ విడుదల (Twitter/Photo)

సర్కారు వారి పాట ‘కళావతి’ ఫుల్ సాంగ్ విడుదల (Twitter/Photo)

Mahesh Babu - Sarkaru Vaari Paata - Kalaavathi Full Song  Released:  సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నటించిన లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). ఈ సినిమా భారీ అంచనాల నడుమ గత నెల మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమాలో కళావతి ఫుల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.

ఇంకా చదవండి ...
    Mahesh Babu - Sarkaru Vaari Paata - Kalaavathi Full Song  Released:  సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నటించిన లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). ఈ సినిమా భారీ అంచనాల నడుమ గత నెల మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. యువ దర్శకుడు పరుశురామ్ పెట్లా దర్శకత్వం వహించగా.. కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటించారు. థమన్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఇప్పటికే సర్కారు వారి పాట సినిమా థియేట్రికల్ రన్ ముగింపుకు వచ్చింది. తాజాగా  ఈ సినిమా అమెజాన్ రెంటల్ బేసెస్‌లో విడుదల చేశారు. ఈ సినిమా రిలీజ్ అయిన మూడు వారాలు తర్వాత మేకర్స్ ‘మురారి వా’ అనే ఓ స్పెషల్ సాంగ్ ని థియేట్రికల్ వెర్షన్ కి యాడ్ చేసారు.ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి.

    తాజాగా ఈ సినిమాలోని కళావతి పాట 200 మిలియన్ వ్యూస్ యూట్యూబ్‌లో క్రాస్ చేసింది. ఈ యేడాది టాలీవుడ్‌లో విడుదలైన సినిమాల్లో ఓ పాట 200 మిలియన్ వ్యూస్ క్రాస్ చేయడం ఇదే ఫస్ట్. తాజాగా ఈ సినిమాలోని కళావతి ఫుల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.


    ఇక ఈ సినిమా ప్రిరిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ఈ సినిమా మొత్తంగా 120 కోట్లకు జరిగిందని తెలుస్తోంది. నైజాంలో 36 కోట్లకు అమ్ముడైందని తెలుస్తోంది. సీడెడ్ 13 కోట్లకు, ఉత్తరాంధ్ర 12. 50 కోట్లకు.. ఈ స్ట్ 8.50 కోట్లకు, వెస్ట్ 7 కోట్లకు, గుంటూరు 9 కోట్లకు, కృష్ణ 7.50 కోట్లకు, నెల్లూరు 4 కోట్లకు ఇక ఏపీ తెలంగాణ మొత్తంగా 96. 50 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఇక కర్నాటక 8.50 కోట్లకు, రెస్ట్ ఆఫ్ ఇండియా 3 కోట్లకు, ఓవర్సీస్ 11 కోట్లకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. మొత్తంగా 120 కోట్లకు అమ్ముడు పోయింది. దీంతో బ్రేక్ ఈవెన్ కావాలంటే 121 కోట్లు రావాల్సి ఉంది.



    సర్కారు వారి పాట కలెక్షన్స్ విషయానికి వస్తే..ఈ సినిమా మూడో వీకెండ్‌లోకి అడుగు పెట్టి.. కలెక్షన్స్ విషయంలో డౌన్ అయ్యింది.ఇక వరల్డ్ వైడ్‌గా ఇప్పటి వరకు ఈ సినిమా 112.55 కోట్ల షేర్‌ను, రూ. 180 కోట్ల గ్రాస్‌ వసూళ్లను అందుకున్నట్టు సమాచారం.  ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ విషయానికి వస్తే.. 121 కోట్ల టార్గెట్ కి ఈ సినిమా ఇంకా రూ. 8.45  కోట్లను రాబట్టింది. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ భారీ రేటుకి దక్కించుకుంది. ఇక ఒప్పందంలో భాగంగా ఈ సినిమాను అమేజాన్ ప్రైమ్  జూన్ 24న సినిమాను స్ట్రీమింగ్ తెస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అద్దె బేసెస్‌లో ఈ సినిమాను అమెజాన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.  ఇక ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా థియేటర్స్‌లో విడుదలైంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Mahesh Babu, Sarkaru Vaari Paata, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు