సూపర్ స్టార్ మహేష్ బాబు.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో మహేష్ బాబు.. ఫస్ట్ టైమ్ ఒక ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ఫస్ట్ టైమ్.. మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. మరోవైపు ఒకప్పటి లేడీ సూపర్ స్టార్ విజయ్ శాంతి ఈ సినిమాతో నటిగా రీ ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుండి ప్రతి మండే ఈ సినిమా విడుదల అయ్యేంత వరకు ఈ చిత్రానికి సంబంధించిన ఏదో ఒక అప్డేట్ ఇస్తున్నట్టు సరిలేరే నీకెవ్వరు చిత్ర యూనిట్ ప్రకటించింది. గత వారం ఈ సినిమా నుంచి రెండో పాటను రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘సూర్యుడివో చంద్రుడివో ’ పాటను రిలీజ్ చేసారు.
ఈ పాట ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడుకొని ఉంది. చాలా రోజుల తర్వాత ఒక స్టార్ హీరో చిత్రంలో ఇలాంటి పాటను సందర్భాను సారంగా పెట్టడం విశేషమనే చెప్పాలి.రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటకు దేవీశ్రీ ప్రసాద్ మంచి సంగీతాన్ని అందించారు. ప్రరాక్ ఈ పాటను అద్భుతంగా పాడాడు. ఈ సినిమాను దిల్ రాజు, అనిల్ సుంకరతో కలిసి మహేష్ బాబు నిర్మించారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.