మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీకి గుమ్మడికాయ కొట్టేసిన చిత్ర యూనిట్..

ఈ ఇయర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరే నీకెవ్వరు’ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ గుమ్మడికాయ కొట్టేసారు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: December 19, 2019, 7:04 AM IST
మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీకి గుమ్మడికాయ కొట్టేసిన చిత్ర యూనిట్..
‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి గుమ్మడికాయ కొట్టేసిన చిత్ర యూనిట్ (Twitter/Photo)
  • Share this:
ఈ ఇయర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరే నీకెవ్వరు’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు ఫస్ట్ టైమ్ .. ఒక ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో కనిపించబోతున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 11న విడుదల కానుంది.ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌కు టీజర్‌, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీటైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఈ సినిమాకు గుమ్మడి కాయ కొట్టేసారు. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసారు. జూలై 5న మొదలైన మా ప్రయాణం.. డిసెంబర్ 18తో షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీటైంది. ఈ సంక్రాంతి సినీ అభిమానులకు, ప్రేక్షకులుకు ఫ్యాన్స్‌కు మరిచిపోలేని సంక్రాంతి అవుతుందంటూ అనిల్ రావిపూడి చిత్ర యూనిట్‌తోఉన్న ఫోటోను పోస్ట్ చేసారు.

ఈ చిత్రంతో లేడీ సూపర్ స్టార్ విజయ శాంతి నటిగా రీ ఎంట్రీ ఇస్తోంది. మరోవైపు మహేష్ బాబు సరసన ఫస్ట్ టైమ్ రష్మిక మందన్న హీరోయిన్‌గా యాక్ట్ చేస్తోంది. ఈ సినిమాను అనిల్ సుంకర, దిల్ రాజులతో కలిసి మహేష్ బాబు ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.  ఈ సినిమాకు మహేష్ బాబు పారితోషకం కాకుండా.. సినిమాకు సంబంధించిన శాటిలైట్ రైట్స్.. డిజిటల్ రైట్స్.. హిందీ డబ్బింగ్ రైట్స్‌ను తీసుకున్నాడనే టాక్ వినబడుతోంది. మొత్తానికి వచ్చే సంక్రాంతికి మహేష్ బాబు బాక్సాఫీస్‌ను శాసిస్తాడా లేదా అనేది చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: December 19, 2019, 7:02 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading