మహేష్ బాబును రష్మిక మందన్న ర్యాగింగ్ చేసింది. ఇపుడీ మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. సూపర్ స్టార్ మహేష్ బాబు.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో మహేష్ బాబు.. ఫస్ట్ టైమ్ ఒక ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల చేయనున్నారు. అంతేకాదు వచ్చే నెల 5న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే ఈ చిత్రంలో మిలటరీ సాంగ్ సహా మూడు పాటలను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ తాజాగా.. మహేష్ బాబును రష్మిక మందన్న ఆట పట్టిస్తున్న ‘హి ఈజ్ సో క్యూట్’ పాటను రిలీజ్ చేసారు. ఈ పాటలో మహేష్ బాబును టీజ్ చేస్తూ చేసిన పాట ఇపుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.
‘సరిలేరు నీకెవ్వరు’ మూవీతో ఒకప్పటి లేడీ సూపర్ స్టార్ విజయ్ శాంతి ఈ సినిమాతో నటిగా రీ ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుండి ప్రతి మండే ఈ సినిమా విడుదల అయ్యేంత వరకు ఈ చిత్రానికి సంబంధించిన ఏదో ఒక అప్డేట్ ఇస్తున్నట్టు సరిలేరే నీకెవ్వరు చిత్ర యూనిట్ ప్రకటించింది. గత రెండు వారాలుగా ఈ సినిమా ఒక పాటను రిలీజ్ చేస్తున్నారు. ఈ వారం ‘ హీ ఈజ్ సో క్యూట్’ పాటను రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటకు దేవీశ్రీ ప్రసాద్ మంచి సంగీతాన్ని అందించారు. ఈ పాటను తెలంగాణ ఫోక్ సింగర్ మధుప్రియ చాలా అద్భుతంగా పాడింది. ఈ సినిమాను దిల్ రాజు, అనిల్ సుంకరతో కలిసి మహేష్ బాబు నిర్మించారు.