స్మాల్ స్క్రీన్ పై మహేష్ బాబు దూకుడు.. మరోసారి సత్తా చూపెట్టిన సూపర్ స్టార్..

ఈ ఇయర్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ’సరిలేరు నీకెవక్వరు’ సినిమా బాక్సాఫీస్ దగ్గర బొమ్మ దద్దరిల్లేలా చేసింది. 

news18-telugu
Updated: July 9, 2020, 3:15 PM IST
స్మాల్ స్క్రీన్ పై మహేష్ బాబు దూకుడు.. మరోసారి సత్తా చూపెట్టిన సూపర్ స్టార్..
మహేష్ బాబు (Twitter/Photo)
  • Share this:
ఈ ఇయర్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ’సరిలేరు నీకెవక్వరు’ సినిమా బాక్సాఫీస్ దగ్గర బొమ్మ దద్దరిల్లేలా చేసింది.  అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం టైటిల్‌కు తగ్గట్టుగానే అన్ని ఏరియాల్లో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 150 కోట్లకు దగ్గర దగ్గరగా షేర్ రాబట్టి ఔరా అనిపించింది. మహేష్ బాబు నటనతో పాటు రష్మిక మందన్న అందాలు ఈ సినిమాకు స్పెషల్‌ ఎస్సెట్‌గా నిలిచాయి. అంతేకాదు ఈ సినిమా మహేష్ బాబు కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. బిగ్ స్క్రీన్ పై  సత్తా చాటిన ఈ సినిమా స్మాల్ స్క్రీన్ పై కూడా ఇరగదీసింది. ఆ మధ్య జెమినీ టీవీలో మొదటిసారి ప్రసారమైన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా మొదటి సారి 23.4 టీఆర్పీ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఇప్పటి వరకు టాలీవుడ్‌లో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘టెంపర్’ సినిమా జెమిని మొదటిసారి ప్రసారమైనపుడు అత్యధికంగా 29.9 టీఆర్పీ సాధించింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘గబ్బర్ సింగ్’ సినిమా 24 టీఆర్పీతో రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా మొదటిసారి 23.4 టీర్పీతో మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత బాహుబలి  2 చిత్రం 22.70 సాధించగా.. బాహుబలి మొదటి పార్ట్ 21.84 రేటింగ్స్‌తో నాలుగు, ఐదో స్థానంలో నిలిచాయి.  తాజాగా స్మాల్ స్క్రీన్ పై రెండోసారి ప్రసారమైన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా 17.4 టీర్పీ సాధించడం విశేషం. మొత్తంగా వెండితెరపై సూపర్ హిట్టైన ఈ చిత్రం చిన్నతెరపై కూడా ఒకటి రెండు సార్లు సూపర్ హిట్ అవ్వడం మాములు విషయం కాదు. మొత్తంగా స్మాల్ స్క్రీన్ పై మహేష్ బాబు కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటో  సరిలేరు నీకెవ్వరు సినిమా మరోసారి ఋజువు చేసింది.

Published by: Kiran Kumar Thanjavur
First published: July 9, 2020, 3:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading