Home /News /movies /

SUPER STAR MAHESH BABU SARILERU NEEKEVVARU CONTINUES RULING THIS MOVIE MOST TWEETED MOVIE TAG OF TFI TA

Mahesh Babu: ఆ విషయంలో మహేష్ బాబు నిజంగానే తోపు.. నీ దూకుడు సాటెవ్వరు అంటున్న ఫ్యాన్స్..

మహేష్ బాబు (Twitter/Photo)

మహేష్ బాబు (Twitter/Photo)

Mahesh Babu: ఆ విషయంలో మహేష్ బాబు నిజంగానే తోపు.. నీ దూకుడు సాటెవ్వరు అంటున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. వివరాల్లోకి వెళితే..

    Mahesh Babu: ఆ విషయంలో మహేష్ బాబు నిజంగానే తోపు.. నీ దూకుడు సాటెవ్వరు అంటున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. వివరాల్లోకి వెళితే.. 2020లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన  చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం టైటిల్‌కు తగ్గట్టుగానే అన్ని ఏరియాల్లో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ చిత్రం మిక్స్‌డ్ తెచ్చుకున్నా.. మహేష్ బాబు తన స్టామినాతో ఈ సినిమాను విజయ తీరాలకు చేర్చాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం అక్కడక్కడా తేలిపోయినా.. మహేష్ బాబు తనదైన నటనతో ఈ సినిమాను నిలబెట్టాడు. ఈ సినిమా మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 143 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ఓవర్సీస్‌ మార్కెట్‌లో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా  2 మిలియన్ డాలర్స్‌ను వసూళు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. మరోవైపు ఈ సినిమాతో విజయశాంతి నటిగా రీ  ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే ఈ సినిమాను కన్నడలో డబ్ చేసి రిలీజ్ చేసారు. రీసెంట్‌గా లాక్‌డౌన్ తర్వాత తమిళంలో ఈ సినిమాను ‘ఇవానుక్కు సరియాన ఆల్ ఇల్లై’ ( IVANUKKU SARIYAANA AAL ILLAI ) పేరుతో డబ్ చేసి రిలీజ్ చేసారు.

    ఆ సంగతి పక్కన పెడితే..ఈ సినిమా టాలీవుడ్‌లో ఎక్కువమంది ట్వీట్స్ చేసిన సినిమాగా 2సరిలేరు నీకెవ్వరు’ రికార్డులకు ఎక్కింది. అంతేకాదు 2019లో కూడా మహేష్ బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ సినిమా కూడా ఎక్కువ మంది ట్వీట్స్ చేసిన సినిమాగా నిలిచింది. అంతకు ముందు 2018లో ‘భరత్ అను నేను’ సినిమా కూడా ఎక్కువ మంది ఈ సినిమాను ట్వీట్ చేస్తూ ట్యాగ్ చేసిన సినిమాగా రికార్డులకు ఎక్కింది.





    వరుసగా మూడు యేడాదులు కూడా మహేష్ బాబు నటించిన సినిమాలు ఈ రకంగా ట్విట్టర్‌లో దూకుడు ప్రదర్శంచడాన్ని చూస్తే.. హీరోగా మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ రేంజ్ ఏంటో అర్ధవుతోంది. ప్రస్తుతం మహేష్ బాబు .. పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరిలో ప్రారంభం కానుంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను బ్యాంకింగ్ రంగంలోని కుంభ కోణాల నేపథ్యంలో తెరకెక్కించబోతున్నారు.ఈ సినిమాలో మహేష్ బాబు తండ్రి కొడుకులుగా త్రిపాత్రాభినయం చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై సినిమా యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ విలన్ పాత్రలో నటించబోతున్నాడు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Mahesh babu, Rashmika mandanna, Sarileru Neekevvaru, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు