• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • SUPER STAR MAHESH BABU REVIEW ON VAKEEL SAAB MOVIE HERE ARE THE DETAILS TA

Mahesh Babu On Vakeel Saab: వకీల్ సాబ్‌ పై మహేష్ బాబు రివ్యూ.. ఇంతకీ ఏమన్నాడంటే..

పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ మూవీపై మహేష్ బాబు రివ్యూ (Twitter/Photo)

Mahesh Babu On Vakeel Saab: వకీల్ సాబ్‌ మూవీ చూసి మహేష్ బాబు తనదైన శైలిలో ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

  • Share this:
    Mahesh Babu On Vakeel Saab: వకీల్ సాబ్‌ మూవీ చూసి మహేష్ బాబు తనదైన శైలిలో ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. ఈ శుక్రవారం (ఏప్రిల్ 9)న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ‘వకీల్ సాబ్’ మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. దాదాపు మూడేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన మూవీ పై అన్ని వర్గాల నుంచి పాజిటివ్ బజ్ వినబడుతోంది. ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఈ సినిమా చూసి పవన్ కళ్యాణ్.. పవర్ ప్యాక్‌డ్ పర్ఫామెన్స్ అంటూ మెచ్చుకుంటున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి.. అమ్మ అంజనా దేవితో కలిసి తమ్ముడు పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ మూవీ చూసి చాల ా కాలం తర్వాత పవన్ లోని నటుడిని ఈ సినిమాలో చూసానంటూ ఆనందం వ్యక్తం చేసారు.

    మరోవైపు రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ వంటి మెగా హీరోలు, నితిన్, నిఖిల్ వంటి హీరోలు పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్’ మూవీపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. పవన్ కళ్యాణ్‌ ఫ్యామిలీకి చెందిన హీరోలు పొగడం పెద్ద విషయం కాదు. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ‘వకీల్ సాబ్’ మూవీ చూసి పవన్ కళ్యాణ్ నటనతో పాటు ప్రకాష్ రాజ్ యాక్టింగ్‌ను మెచ్చుకున్నారు. చాలా కాలం తర్వాత అసలు సిసలైన కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కిన ‘వకీల్ సాబ్’ అందరు చూడాల్సిన సినిమా అంటూ మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్‌తో పాటు ఈ సినిమాలో నటించిన అంజలి, నివేదా, అనన్య నాగళ్ల నటనను మహేష్ బాబు  కొనియాడారు.





    వకీల్ సాబ్ మూవీ విషయానికొస్తే.. ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 36 కోట్లకు పైగా రాబట్టింది. కరోనా సమయంలో ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టి హీరోగా పవన్ కళ్యాణ్ రేంజ్ ఏంటో మరోసారి ప్రూవ్ చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 53 కోట్లకు పైగా వసూళ్లను సాధించాలి.ఓవర్సీస్‌లో ఈ సినిమా ఫస్ట్ డే హాఫ్ మిలియన్ డాలర్స్ కలెక్షన్లు రాబట్టింది.  ముందు ముందు ఈ సినిమా ఏ మేరక కలెక్షన్‌లను రాబడుతుందో చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: