• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • SUPER STAR MAHESH BABU RELEASED ASHOK GALLA NEW MOVIE HERO TEASER TA

Ashok Galla As Hero: సూపర్ స్టార్ మహేష్ బాబు చేతులు మీదుగా గల్లా అశోక్ ‘హీరో’ టీజర్ విడుదల..

హీరోగా ఎంట్రీ ఇస్తోన్న అశోక్ గల్లా (Twitter/Photo)

Ashok Galla As Hero: కృష్ణ మనవడు.. మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. గతంలో ఈయన హీరోగా ఓ సినిమా మొదలై ఆగిపోయింది. ఇపుడు తాజాగా ఈయన శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా చేసారు. ఈ చిత్రానికి ‘హీరో’ అనే టైటిల్ ఖరారు చేసారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేసారు.

  • Share this:
    Ashok Galla As Hero: ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీతో పాటు అన్ని ఇండస్ట్రీస్‌లో వారసులదే హవా. ఇక సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి ముందుగా రమేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కానీ ప్రేక్షకాదరణ పొందలేకపోయారు. ఆ తర్వాత మహేష్ బాబు తండ్రి బాటలో హీరోగా ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ తండ్రి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఆ తర్వాత కృష్ణ ఫ్యామిలీ పేరు చెప్పుకొని.. చిన్నల్లుడు సుధీర్ బాబు పోసాని కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చేసారు. ఇపుడు కృష్ణ మనవడు.. మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. గతంలో ఈయన హీరోగా ఓ సినిమా మొదలై ఆగిపోయింది.

    ఇపుడు తాజాగా ఈయన శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా చేసారు. ఈ చిత్రానికి ‘హీరో’ అనే టైటిల్ ఖరారు చేసారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రం టీజర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేసారు.



    ఈ టీజర్‌లో అశోక్ గల్లా కౌబాయ్ గెటప్‌లో కనిపించి అభిమానులను కనువిందు చేసారు. మరోవైపు జోకర్ వేషంలో అలరించారు. ఈ సినిమాలో అశోక్ గల్లా హీరో పాత్రలో నటిస్తున్నాడా అనేది చూడాలి. ఈ సినిమాలో ఒకప్పటి సూపర్ స్టార్ కృష్ణ  స్టెప్పేసిన జుంబారే జుం జుంబరే పాటను రీమిక్స్ చేసారు.  ఈ పాట అప్పట్లో సంచలనం. ఇప్పటికీ ఈ పాటకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన యమలీల సినిమాలో 'జుంబారే' పాటలో సూపర్ స్టార్  కృష్ణ డ్యాన్సుతో అలరించారు. అప్పట్లో ఓ బడా హీరో ఈ రకంగా పాట కోసం గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వడం అదే మొదలు.

    ‘హీరో’గా అశోక్ గల్లా (Twitter/Photo)


    ఈ పాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడగా.. జొన్నవిత్తుల సాహిత్యం అందించారు. ఇప్పుడు ఈ పాటను  హీరో సినిమా కోసం వాడుకున్నారు. ఈ చిత్రాన్ని అమరరాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో పద్మావతి గల్లా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ, గల్లా అరుణ కుమారి సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో ఇతర ముఖ్యపాత్రల్లో జగపతి బాబు, వెన్నెల కిషోర్, సీనియర్ నరేష్, బ్రహ్మానందం నటించారు. క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ  సినిమా త్వరలో ప్రేక్షకుల మందుకు రానుంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: