Home /News /movies /

SUPER STAR MAHESH BABU PURI JAGANNADH MUMBAI MAFIA DRAMA BUSINESSMAN COMPLETED 10 YEARS PK

Mahesh Babu Businessman @ 10 Years: మహేష్ బాబు ‘బిజినెస్‌మేన్‌’కు పదేళ్లు.. దుమ్ము రేపిన పూరీ..

బిజినెస్‌మేన్ సినిమాకు పదేళ్లు (mahesh babu businessman)

బిజినెస్‌మేన్ సినిమాకు పదేళ్లు (mahesh babu businessman)

Mahesh Babu Businessman @ 10 Years: మహేష్ బాబు (Mahesh Babu)తో ఓ సారి పని చేసిన తర్వాత.. రెండోసారి పని చేసిన దర్శకుడు హిట్ ఇవ్వడు అని ఇండస్ట్రీలో అప్పటి వరకు గట్టి నమ్మకం ఉంది. తాను ఆ టైప్ కాదని పోకిరి తర్వాత బిజినెస్‌మేన్‌తో (Mahesh Babu Businessman @ 10 Years) నిరూపించిన దర్శకుడు పూరీ జగన్నాథ్.

ఇంకా చదవండి ...
మహేష్ బాబుతో ఓ సారి పని చేసిన తర్వాత.. రెండోసారి పని చేసిన దర్శకుడు హిట్ ఇవ్వడు అని ఇండస్ట్రీలో అప్పటి వరకు గట్టి నమ్మకం ఉంది. అదో బ్యాడ్ సెంటిమెంట్ అయిపోయింది కూడా. అప్పటికే అది నిజమని గుణశేఖర్, త్రివిక్రమ్ లాంటి దర్శకులు నిరూపించారు. అయితే తాను ఆ టైప్ కాదని నిరూపించిన దర్శకుడు పూరీ జగన్నాథ్. పోకిరితో అప్పటికే ఓ సారి ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసారు ఈ జోడీ. పైగా మహేష్ బాబు కూడా దూకుడు లాంటి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ కొట్టి మంచి ఫామ్‌లో ఉన్నాడు. అలాంటి సమయంలో పూరీ, మహేష్ బాబు కాంబినేషన్ అనౌన్స్ అయింది. ఒక్కో సినిమా కోసం రెండేళ్ళు తీసుకుంటున్న మహేష్‌తో కేవలం 80 రోజుల్లోనే బిజినెస్ మేన్ సినిమా పూర్తి చేసాడు పూరీ జగన్నాథ్. 2011 దూకుడు విడుదలైన తర్వాత బిజినెస్ మేన్ సినిమాను మొదలు పెట్టి.. 2012 సంక్రాంతికి విడుదల చేసాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అదనపు ఆకర్షణగా నిలిచింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం మంచి విజయం అందుకుంది. ఇందులో ఓ రకంగా మహేష్ బాబు హీరో కమ్ విలన్‌గా నటించాడు.

సినిమా మొదటి నుంచి కూడా పూర్తిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలోనే కనిపిస్తాడు మహేష్ బాబు. పూరీ మార్క్ స్క్రీన్ ప్లే సినిమాకు ప్లస్ అయింది. 2012,సంజనవరి 13న విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసింది. నేటితో ఈ చిత్రం విడుదలై 10 ఏళ్ళు పూర్తికావస్తోంది. ఈ సందర్భంగా బిజినెస్ మేన్ ఫుల్ కలెక్షన్స్ ఓ సారి చూద్దాం..

Hari Hara Veera Mallu story leaked: అయ్యో ఏంటిది నిధి.. ‘హరిహర వీరమల్లు’ స్టోరీ లీక్ చేసిన హీరోయిన్..


నైజాం: 12.40 కోట్లు
సీడెడ్: 5.70 కోట్లు
ఉత్తరాంధ్ర: 3.40 కోట్లు
ఈస్ట్: 3.10 కోట్లు
వెస్ట్: 2.50 కోట్లు
గుంటూరు: 3.70 కోట్లు
కృష్ణా: 2.25 కోట్లు
నెల్లూరు: 1.35 కోట్లు

ఏపీ-తెలంగాణ టోటల్: 34.40 కోట్లు
ఓవర్సీస్: 3.50 కోట్లు
రెస్టాఫ్ ఇండియా: 2.50 కోట్లు
వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్: 40.40 కోట్లు షేర్

Nagarjuna - CM Jagan: నన్నూ పిలిచారు.. కానీ వెళ్లలేకపోయా.. చిరంజీవి, జగన్ భేటీపై నాగార్జున కీలక వ్యాఖ్యలు..


దూకుడు లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వచ్చిన సినిమా కావడంతో బిజినెస్‌మేన్‌కు రూ.37 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా ఫుల్ రన్ అయ్యేసరికి రూ.40.40 కోట్ల షేర్ వసూలు చేసింది. అంటే బయ్యర్లకు రూ.3.40 కోట్ల లాభాలను అందించింది. సినిమా మరీ సూపర్ హిట్ కాకపోయినా.. మంచి హిట్ అయింది. ఈ చిత్రాన్ని చాలా చోట్ల నిర్మాతలే ఓన్ రిలీజ్ చేసుకున్నారు. గతేడాది అనారోగ్యంతో మరణించిన నిర్మాత ఆర్ఆర్ వెంకట్ హై బడ్జెట్‌తో బిజినెస్ మేన్ సినిమాను నిర్మించాడు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Mahesh Babu, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు