కూతురు సితారతో ఆడుకుంటున్న మహేష్ బాబు..

Mahesh Babu: సెలెబ్రిటీస్ కూడా సినిమాలు మానేసి.. షూటింగ్స్ గోల లేకుండా హాయిగా కుటుంబాలతోనే సమయం గడుపుతున్నారు. ఇప్పుడు మహేష్ బాబు కూడా ఇదే చేస్తున్నాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 25, 2020, 8:21 PM IST
కూతురు సితారతో ఆడుకుంటున్న మహేష్ బాబు..
కూతురు సితారతో ఆడుకుంటున్న మహేష్ బాబు (Mahesh Babu sitara)
  • Share this:
కరోనా కారణంగా ప్రజలంతా ఇళ్లకు పరిమితం అయిపోయారని బాధ పడుతున్నారు కానీ కాస్త ఆలోచిస్తే మనం ఎన్నో ఏళ్లుగా కోల్పోయిన తీపి సమయం మళ్లీ మన దగ్గరికి వచ్చింది. ఎక్కడెక్కడో సిటీస్‌లో బతుకుతున్న వాళ్ళంతా ఇప్పుడు తమ సొంతూళ్లకు వెళ్లిపోయారు. సెలెబ్రిటీస్ కూడా సినిమాలు మానేసి.. షూటింగ్స్ గోల లేకుండా హాయిగా కుటుంబాలతోనే సమయం గడుపుతున్నారు. ఇప్పుడు మహేష్ బాబు కూడా ఇదే చేస్తున్నాడు. తాజాగా ఈయన తన కూతురు సితారతో ఆడుకుంటున్న ఫోటోలను ఆయన భార్య నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేసింది.

పిల్లలకు హాలీడేస్.. తనకు కూడా సెలవులే.. పైగా బయటికి కూడా వెళ్లాల్సిన అవసరం లేదు.. వెళ్లే పరిస్థితులు కూడా లేవు. దాంతో ఇంట్లోనే ఉండి కూతురు సితారతో ఆడుకుంటున్నాడు. ఆయన ఆనందానికి హద్దులు లేకుండా పోయాయని నమ్రత ట్వీట్ చేసింది. అంతే కాకుండా తండ్రీ, కూతురు కలిసి ఆడుకుంటున్న ఫొటోలను షేర్ చేసింది నమ్రత. మహేష్ బాబును సితార ఒక్క క్షణం కూడా వదిలిపెట్టి ఉండటం లేదని పేర్కొంది. కరోనా సమయంలో బంధాలు మరింత బలపడుతున్నాయని చెప్పింది సూపర్ స్టార్ భార్య. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది నమ్రత శిరోద్కర్.

First published: March 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు