అవును మహేష్ బాబు.. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పాత్రలో నటించబోతున్నాడు. అంటే ఆయన బయోపిక్‌లో నటిస్తున్నాడని కాదు. తెలుగు సినిమాకు తొలి కలర్ మూవీ సాంఘికంలో, ఆ తర్వాత కౌబాయ్, జేమ్స్ బాండ్, సినిమా స్కోప్, 70 ఎం ఎం టెక్నాలిజీలను తెలుగు ప్రేక్షకులను పరిచయం చేసిన ఘనత సూపర్ స్టార్ కృష్ణ గారికే దక్కుతుంది. ఇక తండ్రి సూపర్ స్టార్ బాటలో మహేష్ బాబు. ‘టక్కరి దొంగ’ అనే కౌబాయ్ చిత్రం చేసిన సంగతి తెలిసిందే కదా. ఆ తర్వాత మహేష్ బాబు.. జేమ్స్ బాండ్ తరహా స్పై పాత్రను ‘స్పైడర్’ సినిమాలో చేసాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. తాజాగా మహేష్ బాబు.. తన నెక్ట్స్ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమాను జేమ్స్ బాండ్ తరహా స్పై సినిమా అని చెబుతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తైయిన ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. గతంలో కృష్ణ.. ‘గూఢచారి 116’, ‘గూఢచారి 117’, ‘రహస్య గూఢచారి’,‘.జేమ్స్ బాండ్ 777’, ‘ఏజెంట్ గోపి’ వంటి పలు సినిమాల్లో జేమ్స్ బాండ్ పాత్రల్లో మెప్పించి ఆ తరహా పాత్రలంటే కృష్ణగారే గుర్తుకు వచ్చేలా చేసిన సంగతి తెలిసిందే. ఇపుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు.. పూర్తి స్థాయి సీక్రెట్ ఏజెంట్ పాత్రలో అభిమానులను కనువిందు చేయనున్నాడు.
ఇక ఈ సంక్రాంతికి మహేష్ బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా బీ,సీ సెంటర్స్‌లో ఈ సినిమా హవా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ సాధించడంతో మహేష్ బాబు.. కాస్తంత రిలాక్స్ యూఎస్ బయలు దేరి వెళ్లాడు. అక్కడ కొన్ని రోజులు రిలాక్స్ అయిన తర్వాత వంశీ పైడిపల్లి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anil Ravipudi, Krishna, Mahesh babu, Sarileru Neekevvaru, Telugu Cinema, Tollywood, Vamsi paidipally