SUPER STAR MAHESH BABU ONE NENOKKADINE MOVIE HEROIN KRITI SANON BABY BUMP PHOTOS ON THE SETS OF MIMI MOVIE HERE ARE THE DETAILS TA
తల్లి కాబోతున్న మహేష్ బాబు భామ.. ఫోటో వైరల్..
మహేష్ బాబు, కృతి సన్ (Twitter/Photos)
అవును మహేష్ బాబుతో వన్ అదేనండి నేనొక్కడినే సినిమాలో నటించిన కృతి సనన్ త్వరలో తల్లి కాబోతుంది. ఆమె గర్భంతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అవును మహేష్ బాబుతో వన్ అదేనండి నేనొక్కడినే సినిమాలో నటించిన కృతి సనన్ త్వరలో తల్లి కాబోతుంది. ఆమె గర్భంతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే.. ఈ భామ కడుపుతో ఉన్న ఫోటోలు మాత్రం నిజం కావు. ప్రస్తుతం ఈ భామ .. ‘మిమీ’పేరుతో ఒక సినిమా చేస్తోంది. లక్ష్మణ్ ఉతెకర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో కఈతి సరోగేట్ మదర్ పాతర్లో నటిస్తోంది. ఈ నేపథ్యంలో కృతి సనన్ కడుపుతో ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐతే... ఈ ఫోటోను సినిమా వాళ్లు కాకుండా.. ఒక అభిమాని ఈ ఫోటో షేర్ చేసారు. కాగా ఈ పాత్ర కోసం కృతిసనన్ దాదాపు 15 కిలోల బరువు పెరిగింది. కృతి సనన్ విషయానికొస్తే.. తెలుగులో సుకుమర్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన ‘వన్ ‘నేనొక్కడినే’ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.
మిమి సినిమాలో బేబి బంప్‌తో కృతి సనన్ (Twitter/Photo)
ఈ చిత్రం అప్పట్లో ప్రేక్షకులకు ఈ చిత్రం సరిగా అర్ధం కాక డిజాస్టర్ అయింది. ఈ సినిమా తర్వాత నాగ చైతన్య హీరోగా నటించిన ‘దోచెయ్’ సినిమాలో నటించింది. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో నటించలేదు. తెలుగులో అంతగా కలిసిరాకపోయినా.. హిందీలో మాత్రం వరస ఆఫర్లతో దూసుకుపోతుంది. హిందీలో ‘బరేలీ కీ బర్ఫీ’, ‘లుకా చుప్పీ’, ‘హౌస్ ఫుల్ 4’ తదితర సూపర్ హిట్ సినిమాల్లో దూసుకుపోతుంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.