మహేష్ బాబు హిట్స్‌లో ఉన్న దర్శకులను మాత్రమే నమ్ముతుంటాడు.. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో పూరీ జగన్నాథ్ అన్న మాటలివి. ఇప్పుడు ఈయన తీరు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది. నిజంగానే ఇప్పుడు సూపర్ స్టార్ హిట్స్ ఇచ్చిన దర్శకులను మాత్రమే ఎంకరేజ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. ప్రస్తుతం అనిల్ రావిపూడితో సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్నాడు ఈయన. ఈ చిత్ర తొలి షెడ్యూల్ కూడా పూర్తైపోయింది. ఈ చిత్రంలో మేజర్ పాత్రలో నటిస్తున్నాడు ఈయన. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ దర్శకున్ని లైన్లో పెడుతున్నాడు సూపర్ స్టార్.
గీత గోవిందం సినిమాతో గతేడాది బాక్సాఫీస్ షేక్ చేసిన దర్శకుడు పరుశురామ్ ఇప్పుడు తన తర్వాత సినిమాను మహేష్ బాబుతో చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. చాలా రోజులుగా ఈయన తర్వాతి సినిమా ఏంటి అనే ప్రచారం జరుగుతుంటే.. ఈయన మాత్రం కూల్‌గా మహేష్ కోసం కథ సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం కోసం చాలా టైం తీసుకుని స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు ఈయన. మహేష్ బాబుకు కూడా కథ నచ్చడంతో సినిమా పట్టాలెక్కడం ఖాయం అని తెలుస్తుంది.
అనిల్ సినిమా పూర్తైన తర్వాత పరుశురామ్ సినిమాను పట్టాలెక్కించనున్నాడు ఈ సూపర్ స్టార్. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ నిర్మించబోతున్నాడనే ప్రచారం జరుగుతుంది. కథలు నచ్చితే నిర్మాతగా కూడా ఉంటానని ఇదివరకే చెప్పాడు శివ. ఇప్పుడు మహేష్ బాబు సినిమాతోనే ఈయన నిర్మాణంలోకి అడుగు పెడుతున్నాడని తెలుస్తుంది. మరి ఈ చిత్రం ఎలా ఉండబోతుందో చూడాలిక.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Geetha govindam, Mahesh Babu, Telugu Cinema, Tollywood