మహేష్ బాబు కొత్త లుక్.. కూతురు, కొడుకుతో కలిసి చిన్న పిల్లాడిలా..

Mahesh babu Family | లాక్‌డౌన్ పీరియడ్‌ను ఏ హీరో ఎంజాయ్ చేయనంతగా మహేష్ బాబు ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా మహేష్ బాబు.. తన కూతురు సితారతో పాటు కొడుకు గౌతమ్ కృష్ణతో కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాడు.

news18-telugu
Updated: May 17, 2020, 4:54 PM IST
మహేష్ బాబు కొత్త లుక్.. కూతురు, కొడుకుతో కలిసి చిన్న పిల్లాడిలా..
కొత్త లుక్‌తో కేక పుట్టిస్తోన్న మహేష్ బాబు (Instagram/Photo)
  • Share this:
లాక్‌డౌన్ పీరియడ్‌ను ఏ హీరో ఎంజాయ్ చేయనంతగా మహేష్ బాబు ఎంజాయ్ చేస్తున్నాడు. ఎపుడు సినిమాలు షూటింగ్స్‌తో బిజీగా ఉండే మహేష్ బాబు.. ఒక సినిమా షూటింగ్ కంప్లీటైన తర్వాత కుటుంబంతో కలిసి హాలీడేస్‌ను ఎంజాయ్ చేయడం ముందు నుంచే అలవాటే. మరీ ముఖ్యంగా కుటుంబం అంటే ప్రాణమిచ్చే మహేష్ బాబుకు కరోనా కలిసొచ్చింది. కరోనాతో వచ్చిన అనుకోని సెలవులను అదిరిపోయేలా వాడుకుంటున్నాడు. కాలు కూడా బయటికి పెట్టకుండా సెలబ్రిటీస్ అంతా ఆదర్శంగా నిలుస్తున్నారు. అందులో ముఖ్యంగా మహేష్ బాబు అయితే రోజూ తన టైమ్ టేబుల్ కూడా సెట్ చేసుకున్నాడు. ఈ లాక్‌డౌన్ రోజులు ఏం చేయాలనేది కూడా ఈయన ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు. అలాగే చేస్తున్నాడు కూడా. అందులో పిల్లలతో ఆడుకోవడం కీలకం. పిల్లలతో మహేష్ బాబు జాళీగా పిల్లలతో గడుపుతున్న ఫోటోలను నమ్రత ఎప్పుటి కపుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంది. తాజాగా మహేష్ బాబు.. తన కూతుర సితార, కొడుకు గౌతమ్ కృష్ణతో కలిసి ఉన్న ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ లుక్‌లో మహేష్ బాబు చూస్తుంటే.. కొడుకు గౌతమ్ కృష్ణకు బ్రదర్‌లా కనిపిస్తున్నాడు. అంతేకాదు లాక్‌డౌన్ నేపథ్యంలో మహేష్ బాబు మరింత యంగ్‌గా మారిపోయాడు. మిగతా హీరోలు మహేష్ బాబు లుక్‌ను చూసి ఈర్ష్య పడేంతేలా అతని లుక్‌ ఉంది. నిజంగానే మహేష్ బాబు ఏమైనా అమృతం తాగాడా అనేంతేలా యువకుడిగా మారిపోయాడు.
 View this post on Instagram
 

My clan is retiring for the night ❤️❤️good nite people 🌟🌟#lockdownlife #staysafe


A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on

తాజాగా మహేష్ బాబు..పరశురామ్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో మరోసారి కాలేజ్‌కు వెళ్లే పాత్రలో నటిస్తున్నాడు ఫండుగాడు. ఈ సినిమాను  మే 31న తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజున పూజా కార్యక్రమాలతో ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నాడు మహేష్ బాబు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన పనులు కూడా పూర్తి చేసినట్టు సమాచారం. అంతేకాదు తన తండ్రి పుట్టనరోజునే  రాజమౌళి, వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్‌ సినిమాలకు సంబంధించిన ప్రకటన చేసే అవకాశం ఉంది.
First published: May 17, 2020, 4:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading