• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • SUPER STAR MAHESH BABU NEW COSTLY VANITY VAN CARAVAN PHOTOS GOING VIRAL IN SOCIAL MEDIA TA

Mahesh Babu Vanity Van: మహేష్ బాబు వ్యానిటీ వ్యాన్ చూతము రారండి.. వామ్మో ఓ రేంజ్‌లో ఉందిగా..

Mahesh Babu Vanity Van: మహేష్ బాబు వ్యానిటీ వ్యాన్ చూతము రారండి.. వామ్మో ఓ రేంజ్‌లో ఉందిగా..

మహేష్ బాబు వ్యానిటీ వ్యాన్ (Twitter/Photos)

Mahesh Babu Vanity Van: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు సంబంధించిన ఏ విషయానైనా అభిమానులు ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. తాజాగా మహేష్ బాబుకు సంబంధించిన వ్యానిటీ వ్యాన్ సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

  • Share this:
    Mahesh Babu Vanity Van: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు సంబంధించిన ఏ విషయానైనా అభిమానులు ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. మహేష్ బాబు వేసుకునే  డ్రెస్ విషయం నుంచి కాళ్లకు వేసుకునే షూస్.. చేతికి పెట్టుకునే వాచ్ అన్నింటి గురించి ఫ్యాన్స్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఉంటారు. అంతేకాదు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువ బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా మహేష్ బాబు.. స్వాంకీ వ్యానిటీ వ్యాన్‌కు ఓనర్ అయ్యాడు. ఇప్పటి వరకు మహేష్ బాబు.. నిర్మాతలు ఏర్పాటు చేసే వ్యానిటీ వ్యాన్‌ను ఉపయోగించేవారు. కానీ రీసెంట్‌గా తన అభిరుచికి తగ్గట్టు ఓ వ్యానిటీ వ్యాన్‌ను రెడీ చేయించుకున్నాడు. అందులో అన్ని రకాలు సదుపాయాలున్నాయి. ఇప్పటికే అల్లు అర్జున్ కూడా ఓ ఇంద్రభవవం లాంటి కార్వాన్‌ను ఉపయోగిస్తోన్న సంగతి తెలిసిందే కదా.

    దీని ఇంటీరియల్ డిజైన్ కోసం  రూ. 8 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు సమాచారం. ఇపుడు మహేష్ బాబు కూడా అదే రేంజ్‌లో వ్యానిటీ వ్యాన్‌ను రెడీ చేయించుకున్నాడు. తాజాగా సందీప్ రెడ్డి వంగాతో తమన్నాతో కలిసి చేసిన యాడ్‌ కోసం మహేష్ బాబు ఈ వ్యానిటీ వ్యాన్‌ను ఉపయోగించాడు.

    మహేష్ బాబు ‘వ్యానిటీ వ్యాన్’ లోపల ఎలా ఉందో చూడండి.. (Twitter/Photo)


    మహేష్ బాబు సినిమాల కంటే  ఎండోర్స్‌మెంట్స్‌తోనే ఎక్కువగా సంపాదిస్తున్నాడు సూపర్ స్టార్. రెమ్యునరేషన్ కూడా ఒక్కో సినిమాకు దాదాపు 40 కోట్లకు పైగానే తీసుకుంటున్నాడు సూపర్ స్టార్. ఆయన లైఫ్ స్టైల్ కూడా అంతే స్టైల్‌గా ఉంటుంది. తాజాగా మహేష్ బాబు తన వ్యానిటీ వ్యాన్ కోసం రూ. 10 కోట్లకు పైగానే ఖర్చు చేసినట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. పూణేకు చెందిన ఆటోమొబైల్ డిజైనింగ్ సంస్థ ఈ వ్యానిటీ వ్యాన్ లోపలి ఇంటీరియర్ డిజైన్ చేసారట. ఇందులో హోం థియేటర్‌తో పాటు సకల సదుపాయాలున్నాయట.

    mahesh babu,mahesh babu caravan,mahesh babu caravan price,mahesh babu caravan cost,mahesh babu luxurious caravan,facts about mahesh babu luxurious caravan,mahesh babu vanity van,mahesh shoot caravan details,mahesh babu new caravan,mahesh babu house video,mahesh babu car collection,mahesh babu lifestyle,మహేష్ బాబు న్యూ కార్వాన్,మహేష్ బాబు కార్వాన్,తెలుగు సినిమా
    మహేష్ బాబు న్యూ కార్వాన్ (Mahesh Babu new caravan)


    ప్రస్తుతం సోషల్ మీడియాలో మహేష్ కొత్త కార్వాన్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇది కూడా మహేష్ లక్కీ నెంబర్ 4005 తో రిజిస్టర్ చేయబడటం విశేషం. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈయన 'సర్కారు వారి పాట' సినిమాతో బిజీగా ఉన్నాడు. పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఈ మధ్యే దుబాయ్‌లో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకుని మన దేశానికి తిరిగి వచ్చారు. గోవాలో మరో భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్.

    mahesh babu,mahesh babu caravan,mahesh babu caravan price,mahesh babu caravan cost,mahesh babu luxurious caravan,facts about mahesh babu luxurious caravan,mahesh babu vanity van,mahesh shoot caravan details,mahesh babu new caravan,mahesh babu house video,mahesh babu car collection,mahesh babu lifestyle,మహేష్ బాబు న్యూ కార్వాన్,మహేష్ బాబు కార్వాన్,తెలుగు సినిమా
    మహేష్ బాబు న్యూ కార్వాన్ (Mahesh Babu new caravan)


    ‘సర్కారు వారి పాట’ సినిమాను  14 రీల్స్ ప్లస్ - మైత్రీ మూవీ మేకర్స్ - జీఎంబీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. 2022 సంక్రాంతి కానుకగా 'సర్కారు వారి పాట' విడుదల కానుంది. ఏదేమైన మహేష్ బాబు కార్వాన్ మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. రీసెంట్‌గా మహేష్ బాబు.. ఫిట్నెస్ విషయంలో Synt Globla Spa Fit and Fab Wellness Icon Award వచ్చింది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: