• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • SUPER STAR MAHESH BABU NEW COSTLY CARAVAN PHOTOS GOING VIRAL IN SOCIAL MEDIA PK

Mahesh Babu: మహేష్ బాబు కొత్త కార్వాన్ ఫోటోలు వైరల్.. లోపల మినీ ఇంద్రభవనమే ఉందిగా..!

Mahesh Babu: మహేష్ బాబు కొత్త కార్వాన్ ఫోటోలు వైరల్.. లోపల మినీ ఇంద్రభవనమే ఉందిగా..!

మహేష్ బాబు Photo : Twitter

Mahesh Babu: హీరోలకు ఇప్పుడు కార్వాన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న ఆర్టిస్టు నుంచి స్టార్ హీరోల వరకు అందరికీ షూటింగ్ స్పాట్‌కు వెళ్తే అక్కడ కార్వాన్ ఉండాల్సిందే.

  • Share this:
హీరోలకు ఇప్పుడు కార్వాన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న ఆర్టిస్టు నుంచి స్టార్ హీరోల వరకు అందరికీ షూటింగ్ స్పాట్‌కు వెళ్తే అక్కడ కార్వాన్ ఉండాల్సిందే. అయితే కొందరు హీరోలు మాత్రం తమకు నచ్చినట్లు కార్వాన్ సిద్ధం చేయించుకుంటారు. అందులో అందరికంటే ముందు అల్లు అర్జున్ ఉన్నాడు. ఈయన తన కార్వాన్ కోసం ఏకంగా 8 కోట్ల వరకు ఖర్చు చేసి అద్భుతమైన ఇంటీరియర్‌తో చేయించుకున్నాడు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఇదే చేస్తున్నాడు. ఈయనకు తెలుగులోనే కాకుండా దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. సినిమాల కంటే కూడా యాడ్స్ రూపంలో నార్త్ ఆడియన్స్‌కు ఎక్కువగా పరిచయం అయ్యాడు మహేష్ బాబు. ఇప్పటికే అక్కడ రణ్‌వీర్ సింగ్ లాంటి స్టార్ హీరోలతో కలిసి యాడ్స్ చేస్తున్నాడు మహేష్. సినిమాల కంటే కూడా ఎండోర్స్‌మెంట్స్‌తోనే ఎక్కువగా సంపాదిస్తున్నాడు సూపర్ స్టార్. రెమ్యునరేషన్ కూడా ఒక్కో సినిమాకు దాదాపు 40 కోట్లకు పైగానే తీసుకుంటున్నాడు సూపర్ స్టార్. ఆయన లైఫ్ స్టైల్ కూడా అంతే స్టైల్‌గా ఉంటుంది. పుట్టినప్పటి నుంచి రోడ్ సైడ్ ఫుడ్ ఒక్కసారి కూడా ఈయన తినలేదంటే మహేష్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే ఇప్పుడు తన కార్వాన్ కోసం కోట్లు ఖర్చు చేస్తున్నాడు మహేష్ బాబు. తన అభిరుచికి తగ్గట్టుగా అద్భుతంగా డిజైన్ చేసినట్లు తెలుస్తుంది. అద్భుతమైన ఇంటీరియర్‌కు తోడు అత్యంత విలాసవంతగా ఉండేలా ఈ కార్వాన్ సిద్ధమైంది. దీనికోసం 10 కోట్లకు పైగానే మహేష్ బాబు ఖర్చు చేసాడని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
mahesh babu,mahesh babu caravan,mahesh babu caravan price,mahesh babu caravan cost,mahesh babu luxurious caravan,facts about mahesh babu luxurious caravan,mahesh babu vanity van,mahesh shoot caravan details,mahesh babu new caravan,mahesh babu house video,mahesh babu car collection,mahesh babu lifestyle,మహేష్ బాబు న్యూ కార్వాన్,మహేష్ బాబు కార్వాన్,తెలుగు సినిమా
మహేష్ బాబు న్యూ కార్వాన్ (Mahesh Babu new caravan)

ప్రస్తుతం సోషల్ మీడియాలో మహేష్ కొత్త కార్వాన్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇది కూడా మహేష్ లక్కీ నెంబర్ 4005 తో రిజిస్టర్ చేయబడటం విశేషం. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈయన 'సర్కారు వారి పాట' సినిమాతో బిజీగా ఉన్నాడు. పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఈ మధ్యే దుబాయ్‌లో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకుని ఇండియాకు వచ్చారు. గోవాలో మరో భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్.
mahesh babu,mahesh babu caravan,mahesh babu caravan price,mahesh babu caravan cost,mahesh babu luxurious caravan,facts about mahesh babu luxurious caravan,mahesh babu vanity van,mahesh shoot caravan details,mahesh babu new caravan,mahesh babu house video,mahesh babu car collection,mahesh babu lifestyle,మహేష్ బాబు న్యూ కార్వాన్,మహేష్ బాబు కార్వాన్,తెలుగు సినిమా
మహేష్ బాబు న్యూ కార్వాన్ (Mahesh Babu new caravan)

14 రీల్స్ ప్లస్ - మైత్రీ మూవీ మేకర్స్ - జీఎంబీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. 2022 సంక్రాంతి కానుకగా 'సర్కారు వారి పాట' విడుదల కానుంది. ఏదేమైన మహేష్ బాబు కార్వాన్ మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది.
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు