Home /News /movies /

SUPER STAR MAHESH BABU NAMRATA SWEET DAUGHTER SITARA VALENTINE DAY GIFT TO HER PARENTS PK

Mahesh Babu - Namrata: అమ్మా నాన్నకు అదిరిపోయే వాలెంటైన్ డే గిఫ్ట్ ఇచ్చిన సితార..

మహేష్ బాబు నమ్రత (Mahesh Babu Namrata)

మహేష్ బాబు నమ్రత (Mahesh Babu Namrata)

Mahesh Babu - Namrata: సితార పాపకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. మహేష్ బాబు కూతురు ఇప్పుడే నెటిజన్లను ఆకర్షిస్తుంది. తను చేసే పనులతో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. అంతేకాదు స్పెషల్ డేస్ కూడా గుర్తు పెట్టుకుని..

సితార పాపకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. మహేష్ బాబు కూతురు ఇప్పుడే నెటిజన్లను ఆకర్షిస్తుంది. తను చేసే పనులతో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. అంతేకాదు స్పెషల్ డేస్ కూడా గుర్తు పెట్టుకుని సోషల్ మీడియాలో విష్ చేస్తుంటుంది సితార. ఇప్పుడు కూడా ఇదే చేసింది. వాలెంటైన్ డే సందర్భంగా తల్లిదండ్రులకు మంచి బహుమతి ఇచ్చింది. కూతురు ఇచ్చిన గిఫ్ట్ తీసుకుని మురిసిపోయాడు మహేష్ బాబు. దాన్ని అభిమానులతో పంచుకున్నాడు సూపర్ స్టార్. తన కూతురు ఇచ్చిన గిఫ్ట్ అంటూ గర్వంగా చెప్పుకుంటూ మురిసిపోయాడు. అంతేకాదు తనకు అంత మంచి గిఫ్ట్ ఇచ్చిన కూతురుకు కూడా థ్యాంక్స్ చెప్పాడు. థ్యాంక్ యూ సితూ పాప అంటూ ప్రేమగా రిప్లై ఇచ్చాడు. అంతగా సితార ఏమిచ్చింది అనుకుంటున్నారా..? ఓ మంచి గ్రీటింగ్ కార్డ్ ఇచ్చింది.. దానిపై అమ్మా నాన్నకు హ్యాపీ వాలెంటైన్ డే అని రాసిచ్చింది సితార. ఇది చూసి సూపర్ స్టార్ కపుల్ మురిసిపోయారు. కూతురు నుంచి ప్రేమగా వచ్చిన గ్రీటింగ్ కార్డ్ చూసి నమ్రత కూడా ఎమోషనల్ అయిపోయింది. ఇక మహేష్ బాబు అయితే గాల్లో తేలిపోయాడు. ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా షూటింగ్ కోసం దుబాయ్‌లో ఉన్నారు మహేష్ ఫ్యామిలీ. స్వామి కార్యం, స్వకార్యం రెండూ ఒకేసారి పూర్తి చేస్తున్నాడు. కుటుంబంతో టూర్ ఎంజాయ్ చేస్తూనే మరోవైపు షూటింగ్ కూడా పూర్తి చేస్తున్నాడు.

పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి 2022కు సినిమా విడుదల కానుంది.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Mahesh babu, Mahesh Babu Daughter Sitara, Telugu Cinema, Tollywood, Valentines Day 2021

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు