Mahesh Babu - Namrata : మరోసారి జంటగా సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత కలిసి నటించారు. వీళ్లిద్దరు కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ వీళ్లిద్దరు కలిసి నటించింది సినిమా కోసం కాదు.. ఓ మ్యాగజైన్ ఫోటో షూట్ కోసం. ఈ మధ్య కాలంలో మహేష్ బాబు భార్య నమ్రతతో పాటు తన పిల్లలతో కలిసి ఓ యాడ్‌లో నటించిన సంగతి తెలిసిందే కదా. ఆ తర్వాత ఎపుడు వీళ్లిద్దరు కలిసి తెరను షేర్ చేసుకోలేదు. తాజాగా మహేష్ బాబు, నమ్రత ఇద్దరు ఓ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం కలిసి స్టిల్స్ ఇచ్చారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతన్నాయి. అంతేకాదు చాలా కాలానికి మహేష్ బాబు, నమ్రతల చూసిన అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు.
నమ్రత ఘట్టమనేని విషయానికొస్తే.. హీరో మహేష్ బాబు భార్యగా సూపర్‌స్టార్‌కు సంబంధించిన అన్ని విషయాలను చూసుకుంటూ ఉంటుంది. అంతేకాదు నమ్రతను పెళ్లి చేసుకున్న తర్వాతే హీరోగా మహేష్ బాబు కెరీర్ స్పీడ్ అందుకుంది. అంతేకాదు మహేష్ బాబు సినిమా కథల సంగతి ఏమో కానీ... మహేశ్ బాబు సినిమాకు సంబంధించిన పబ్లిసిటీ సహా పలు వ్యవహారాలను నమ్రత దగ్గరుండి చూసుకుంటారనే టాక్ కూడా ఉంది.
ఇక మహేష్ బాబు, నమ్రత వీళ్లిద్దరు బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వంశీ’ సినిమాలో మాత్రమే కలిసి నటించారు. ఆ సినిమాలో వీళ్లిద్దరు కలిసి నటించడం వీరి జీవితాన్నే మార్చివేసిందనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ కూడా కీలక పాత్రలో నటించడం విశేషం.ఒక రకంగా భర్త, మామలతో కలిసి నమ్రత ఈ సినిమాలో యాక్ట్ చేయడం విశేషం.
James Bond Heroes: సిల్వర్ స్క్రీన్ పై జేమ్స్ బాండ్‌గా ఇరగదీసిన హీరోలు వీళ్లే..
ఇక వీళ్లిద్దరి మధ్య తొలిసారి ఎవరు ప్రపోజ్ చేసారనే విషయమై నమ్రత పలు సందర్భాల్లో ప్రస్తావించారు. నమ్రత, మహేష్ బాబుకు మధ్య లవ్ న్యూజిలాండ్‌లో మొదలైందట. ‘వంశీ’ షూటింగ్ సమయంలో చివరగా ఆయనతో ప్రేమలో ఉన్న విషయం అపుడే ఇద్దరికి తెలిసిందట. కానీ ఇద్దరిలో ఎవరు ముందు ప్రపోజ్ చేసారనేది ఇప్పటికీ కన్‌ఫ్యూజన్ అంటూ నమ్రత పలు సందర్భాల్లో చెప్పారు. మొత్తంగా వీరి ప్రేమాయణంలో ఒకరికొకరు తెలుపుకున్నారనేది స్పష్టమైంది.
ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే.. సరిలేరు నీకెవ్వరు లాంటీ బ్లాక్ బస్టర్ తర్వాత సర్కారు వారి పాట సినిమాకు సై అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు ఇప్పటి వరకు చేయని డిఫరెంట్ పాత్ర చేస్తున్నట్టు సమాచారం. పరశురామ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను పరశురామ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mahesh Babu, Namrata Shirodkar, Sarkaru Vaari Paata, Tollywood