F2 సీక్వెల్ F3 కోసం రంగంలోకి మహేష్ బాబు.. అనిల్ రావిపూడి కొత్త స్కెచ్..

టాలీవుడ్‌లో గత సంక్రాంతికి విడుదలై  ‘ఎఫ్ 2’ సినిమా  ఎవరి అంచనాలకు అందకుండా బ్లాక్ బస్టర్ హిట్టైయింది. తాజాగా ఈ సినిమా సీక్వెల్ ఎఫ్ 3లో యాక్ట్ చేయడానికి మహేష్ బాబు ఓకే చెప్పినట్టు సమాచారం.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: February 8, 2020, 5:57 PM IST
F2 సీక్వెల్ F3 కోసం రంగంలోకి మహేష్ బాబు.. అనిల్ రావిపూడి కొత్త స్కెచ్..
మహేష్ బాబు,అనిల్ రావిపూడి (Twitter/Photo)
  • Share this:
టాలీవుడ్‌లో గత సంక్రాంతికి విడుదలై  ‘ఎఫ్ 2’ సినిమా  ఎవరి అంచనాలకు అందకుండా బ్లాక్ బస్టర్ హిట్టైయింది. ఈ సినిమా దాదాపు రూ.120 కోట్ల గ్రాస్..రూ.80 కోట్ల షేర్‌ను రాబట్టి ట్రేడ్ పండితులను ఔరా అనేలా చేసింది. ‘ఎఫ్2’లో వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో అనిల్ రావిపూడి ఏ రేంజ్‌లో నవ్వులు పూయించాడో తెలిసిందే కదా. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంలో అనిల్ రావిపూడి సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా సక్సెస్‌తో అనిల్ రావిపూడి.. ‘ఎఫ్ 3’ సీక్వెల్‌ తీయబోతున్నట్టు ప్రకటించాడు. అంతేకాదు ఈ సీక్వెల్ కోసం ముందుగా రవితేజను అనుకున్నారు. తాజాగా ఎఫ్ 3 సీక్వెల్‌లో మహేష్ బాబు యాక్ట్ చేయబోతున్నట్టు సమాచారం. ఈ యేడాది సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మహేష్ బాబుకు మంచి హిట్ అందించాడు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 150 కోట్ల షేర్ వసూలు చేసింది.  దీంతో అనిల్ రావిపూడితో మరో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించాడు. ఈ సినిమాతో మహేష్ బాబుతో అనిల్ రావిపూడికి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ అనుబంధం రీత్యా ఎఫ్ 3 సీక్వెల్‌లో యాక్ట్ చేస్తే బాగుంటుందని సూచించాడట. ఇక అనిల్ రావిపూడికి మహేష్ బాబుకు చెప్పిన నేరేషన్ నచ్చడంతో వెంటనే ఈ చిత్రంలో యాక్ట్ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం.  . ఈ  చిత్రాన్ని వంశీ పైడిపల్లి సినిమా తర్వాత సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. త్వరలోనే ఎఫ్ 3 సీక్వెల్‌కు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది.

 

First published: February 8, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు