ప్రస్తుతం మహేష్ బాబు..వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమా చేస్తున్నాడు.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పార్ట్ కంప్లీటవ్వడంతో ఈసినిమాకు గుమ్మడికాయ కొట్టారు. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తైయినట్టు మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా ‘ఇట్స్ ఏ ర్యాప్’ అని కేక్ ను ట్వీట్ చేసాడు. అంతేకాదు మిమ్మల్ని మే 9న థియేటర్స్‌లో కలవబోతున్నట్టు ప్రకటించాడు. ఐతే ఈ సినిమా మే నెలలో విడుదల కాబోతున్న సందర్భంగా మహేష్ బాబు ఫ్యాన్స్ ఒకటే కంగారు పడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. గతంలో మహేష్ బాబు హీరోగా తేజ దర్శకత్వంలో నటించిన ‘నిజం’ సినిమా మే నెలలో విడుదలైంది.ఈ సినిమాలో నటనకు మహేష్‌కు నంది అవార్డు వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం ‘నిజం’ నిలబడలేక డిజాస్టర్‌గా నిలిచింది.
ఆ తర్వాత మహేష్ బాబు..ఎస్.జే.సూర్య దర్శకత్వంలో నటించిన ‘నాని’ సినిమా కూడా మే నెలలో విడుదలై అట్టర్ ఫ్లాపైంది. ఆ తర్వాత మహేష్ హీరోగా నటించిన ‘బ్రహ్మోత్సవం’ సినిమా కూడా మే మంత్ లోనే రిలీజై సూపర్ స్టార్ కెరీర్లోనే అత్యంత చెత్త సినిమా పేరు తెచ్చుకుంది.
ఇప్పటి వరకు మహేష్ బాబు నటించగా మే నెలలో విడుదలైన సినిమాలేవి హిట్ కాలేకపోయాయి. ఇపుడు అదే సెంటిమెంట్ వర్కౌటై ‘మహర్షి’ సినిమా ఎక్కడ డిజాస్టర్ అవుతుందో అని మహేష్ ఫ్యాన్స్ ఒకటే కంగారు పడిపోతున్నారు. మరి సెంటిమెంట్స్‌ను పక్కనపెట్టి ‘మహర్షి’ సినిమా బాక్సాఫీస్ దగ్గర మెరుపులు మెరిపించి సెంటిమెంట్ అనేది ఏది లేదని ప్రూవ్ చేస్తుందా.. లేకపోతే మే సెంటిమెంట్ వర్కౌటౌ అట్టర్ ఫ్లాప్‌గా నిలుస్తుందా అనేది చూడాలి. ఇక ఈ సినిమాకు వైజయంతీ మూవీస్ అధినేత సి.అశ్వినీదత్ ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఆయన నిర్మాణంలో తెరకెక్కిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’, ‘మహానటి’ సినిమాలు మే 9న విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. ఒక రకంగా ఆయన బ్యానర్‌కు వర్కౌటైన సెంటిమెంట్ మహేష్ ‘మహర్షి’ సినిమాకు కూడా వర్కౌట్ అవుతుందని మహేష్ బాబు ఒకింత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: #Maheshbabu25, Allari naresh, Devi Sri Prasad, Dil raju, Maharshi, Maharshi Movie Review, Mahesh babu, Mahesh Babu Latest News, Pooja Hegde, Telugu Cinema, Tollywood, Vamsi paidipally