ఒకవైపు ఫ్లాప్ సెంటిమెంట్.. మరోవైపు హిట్ సెంటిమెంట్.. రెండింటి మధ్యలో ‘మహర్షి’

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: May 6, 2019, 3:58 PM IST
ఒకవైపు ఫ్లాప్ సెంటిమెంట్.. మరోవైపు హిట్ సెంటిమెంట్.. రెండింటి మధ్యలో ‘మహర్షి’
మహర్షి మూవీ
  • Share this:
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ సినిమా ఈ  నెల 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. హీరోగా ఇది మహేష్ బాబుకు ఇది 25వ సినిమా. కావడంతో ఈసినిమాపై ట్రేడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి.  ఐతే ఈ సినిమా మే నెలలో విడుదల అవుతున్న సందర్భంగా మహేష్ బాబు ఫ్యాన్స్ ఒకటే కంగారు పడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. గతంలో మహేష్ బాబు  హీరోగా తేజ దర్శకత్వంలో నటించిన ‘నిజం’ సినిమా మే నెలలో విడుదలైంది.ఈ సినిమాలో నటనకు మహేష్‌కు నంది అవార్డు వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం ‘నిజం’ నిలబడలేక డిజాస్టర్‌గా నిలిచింది.ఆ తర్వాత మహేష్ బాబు..ఎస్.జే.సూర్య దర్శకత్వంలో నటించిన ‘నాని’ సినిమా కూడా మే నెలలో విడుదలై అట్టర్ ఫ్లాపైంది. ఆ తర్వాత మహేష్ హీరోగా నటించిన ‘బ్రహ్మోత్సవం’ సినిమా కూడా మే మంత్‌ లోనే రిలీజై సూపర్ స్టార్ కెరీర్‌లోనే అత్యంత చెత్త సినిమా పేరు తెచ్చుకుంది.

super star mahesh babu maharshi movie release in May 9th and fans afraid of may bad sentiment and also good sentiment,mahesh babu,mahesh babu twitter,mahesh babu instagram,maharshi movie review,mahesh babu bad sentiment,mahesh babu good sentiment,mahesh babu maharshi,mahesh babu speech,mahesh babu interview,mahesh babu new movie,mahesh babu 25th film,maharshi movie,maharshi,maharshi songs,mahesh babu exclusive interview,mahesh babu and vamshi paidipally exclusive interview,mahesh about maharshi,mahesh babu maharshi movie,mahesh babu maharshi trailer,mahesh babu new movie maharshi,vijay and mahesh babu maharshi,mahesh babu maharshi release date may 9th,mahesh babu maharshi may sentiment,mahesh not workout may sentiment,mahesh babu,mahesh babu vamsi paidipally maharshi,mahesh babu allari naresh pooja hegde maharshi,tollywood news,telugu cinema,jabardasth,tamilnadu elections,prabhas instagram,sri reddy leacks,మహేష్ బాబు,మహేష్ బాబు మహర్షి షూటింగ్ కంప్లీట్,మహర్షి సినిమాకు గుమ్మడికాయ కొట్టిన మహేష్ బాబు,మహేష్ బాబు మహర్షి వంశీ పైడిపల్లి,మహర్షి 9న విడుదల,మహర్షి మహేష్ బాబు అల్లరి నరేష్ పూజాహెగ్డే,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,మహేష్ బాబు ఇన్‌స్టాగ్రామ్,మహేష్ బాబు ట్విట్టర్,మహేష్ బాబు మే సెంటిమెంట్,మహేష్ బాబు కలిసిరాని మే సెంటిమెంట్,మహేష్ బాబు మహర్షి మూవీ రివ్యూ,మహర్షి మూవీ రివ్యూ,మహేష్ బాబు
మహర్షి సినిమా సెన్సార్


ఇప్పటి వరకు మహేష్ బాబు నటించగా మే నెలలో విడుదలైన సినిమాలేవి హిట్ కాలేకపోయాయి. ఇపుడు అదే సెంటిమెంట్ వర్కౌటై  ‘మహర్షి’ సినిమా ఎక్కడ డిజాస్టర్ అవుతుందో అని మహేష్ ఫ్యాన్స్ ఒకటే కంగారు పడిపోతున్నారు. ఇప్పటికే సెన్సార్ వాళ్లు ఈ సినిమాను యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసారు. మరోవైపు ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తోన్న దిల్ రాజు, అశ్వినీదత్‌లకు మాత్రం ‘మే’ నెల బాగానే కలిసొచ్చింది. ముఖ్యంగా వైజయంతీ మూవీస్ అధినేత సి.అశ్వినీదత్‌ నిర్మాణంలో తెరకెక్కిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’,‘మహానటి’ సినిమాలు మే నెలలో అది కూడా 9వ తేదిన రిలీజై బాక్పాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచాయి. ఇపుడు ఆయన ఒక నిర్మాతగా వ్యవహరిస్తోన్న ‘మహర్షి’ సినిమా మే 9నే థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఒక రకంగా అశ్వినీదత్ వైజయంతి బ్యానర్‌కు వర్కౌటైన సెంటిమెంట్ మహేష్ ‘మహర్షి’ సినిమాకు కూడా వర్కౌట్ అవుతుందని మహేష్ బాబు ఒకింత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఒకవైపు ఫ్లాప్ సెంటిమెంట్ మహేష్ బాబు ఫ్యాన్స్‌ను భయపెడుతున్న ..ఇంకోవైపు నిర్మాతగా సి.అశ్వినీదత్ హిట్ సెంటిమెంట్ ‘మహర్షి’ సినిమాకు కలిసొస్తుందనే మహేష్ బాబు ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ‘మహర్షి’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మెరుపులు మెరిపిస్తుందో తెలియాలంటే మే 9 తేది వరకు వెయిట్ చేయాల్సిందే.
First published: May 6, 2019, 3:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading