మహేష్ బాబు ‘మహర్షి’ చిత్రానికి అరుదైన గౌరవం..

ఈ యేడాది సూపర్ స్టార్ మహేష్ బాబు .. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేసిన ‘మహర్షి’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్టైయింది. తాజాగా ఈ సినిమా మరో అరుదైన గౌరవం దక్కించుకుంది. 

news18-telugu
Updated: November 13, 2019, 12:18 PM IST
మహేష్ బాబు ‘మహర్షి’ చిత్రానికి అరుదైన గౌరవం..
మహర్షి సినిమా
  • Share this:
ఈ యేడాది సూపర్ స్టార్ మహేష్ బాబు .. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేసిన ‘మహర్షి’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్టైయింది. తాజాగా ఈ సినిమా మరో అరుదైన గౌరవం దక్కించుకుంది.  ఈ సినిమాలో మహేష్ బాబు.. రిషి అనే స్టూడెంట్‌గా.. పెద్ద ఐటీ కంపెనీ ఓనర్‌గా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. దాంతో ఈ సినిమాలో అన్నం పెట్టే రైతును ఆదుకోవాలని ఈ సినిమాలో సూచించడు.  దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, అల్లరి నరేష్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా మరో అరుదైన గౌరవం దక్కించుకుంది. ఈ సినిమా 2019లో ట్విట్టర్‌లో టాప్ 5 ట్రెండింగ్ ట్యాగ్‌లో టాప్ 4 ప్లేస్ దక్కించుకుంది. ఇందులో టాప్ 1లో అజిత్ హీరోగా నటించిన ‘విశ్వాసం’ నిలిచింది. సెకండ్ ప్లేస్‌లో లోక్‌సభ ఎన్నికలు, మూడో ప్లేస్‌లో వరల్డ్ కప్ 2019,నాల్గో ప్లేస్‌లో మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి సినిమా స్థానం దక్కించుకుంది. ఇక ఐదో ప్లేస్‌లో దీపావళి ట్యాగ్ నిలవడటం విశేషం.

First published: November 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>