• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • SUPER STAR MAHESH BABU GOT SYNTH GLOBAL SPA FIT AND FAB WELLNESS ICON AWARD HERE ARE THE DETAILS TA

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబుకు మరో అరుదైన గౌరవం..

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబుకు మరో అరుదైన గౌరవం..

మహేష్ బాబుకు అరుదైన గౌరవం (Instagram/Photo)

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబుకు మరో అరుదైన గౌరవం దక్కింది. వివరాల్లోకి వెళితే.. 

  • Share this:
    Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబుకు మరో అరుదైన గౌరవం దక్కింది. వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్ ప్రిన్స్‌గా ఎంట్రీ ఇచ్చి సూపర్‌స్టార్ ఎదిగాడు మహేష్ బాబు. కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్, కొద్దికాలంలోనే తనదైన స్టైల్‌తో యూత్ ఫేవరెట్ హీరోగా మారాడు. సింపుల్ స్మైల్‌తో అమ్మాయిల మనసు దోచిన మహేష్ బాబు.. 4 ఏళ్ల వయసులోనే నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. 41 ఏళ్ల ఫిల్మ్ కెరీర్‌లో 35 సినిమాల్లో యాక్ట్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు. అందులో హీరోగా 26 సినిమాల్లో నటిస్తే.. బాల నటుడిగా 9 చిత్రాల్లో తన నటనతో మెప్పించారు మహేష్ బాబు. ఇక కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాజకుమారుడు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోగా 21 ఏళ్ల కెరీర్‌లో తన నటనతో ఎన్నో అవార్డులు అందుకున్నారు మహేష్ బాబు. తాజాగా మహేష్ బాబు‌కు మరో అరుదైన గౌరవం దక్కింది.

    మహేష్ బాబుకు ఫిట్నెస్ విషయంలో Synt Globla Spa Fit and Fab Wellness Icon Award దక్కింది. ఈ విషయాన్నిమహేష్ బాబు తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ఫిట్నెస్ అనేది అంత ఈజీ కాదు. కానీ అసాధ్యం మాత్రం కాదు.



    ఈ సందర్భంగా తనకు ఆ అవార్డు అందజేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం మహేష్ బాబు.. పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా విషయానికొస్తే..  ఈ మూవీని పరుశురామ్ సోషల్ మెసేజ్‌ కథతో తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాలో ముఖ్యంగా బ్యాకింగ్ రంగంలో అవినీతికి సంబంధించిన అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించబోతున్నారని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థను కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా కథ ఉండనుందని తెలుస్తోంది.

    మహేష్ బాబు (Instagram/Photo)


    ఈ సినిమాలో మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఈ సినిమాలో వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని హీరో మహేష్ ఎలా తిరిగి రాబట్టాడు. దానికి సంబందించి ఆయన ఎలాంటి ప్రయత్నాలు చేశాడనేది ఈ సినిమా కథగా తెలుస్తోంది. మరోవైపు సోషల్ మెసేజ్‌తో పాటు అదిరిపోయే రొమాంటిక్ సీన్స్ ఉంటాయట. అందులో భాగంగా చాలా కాలం తర్వాత మహేష్ లవర్ బాయ్‌ గా నటించనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబు తొలిసారి తండ్రి కొడుకులుగా త్రిపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ విలన్ పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: