అభిమానులకు మహేష్ బాబు బంపరాఫర్.. ‘సరిలేరు నీకెవ్వరు’ అంటున్న ఫ్యాన్స్..

అభిమానులకు మహేష్ బాబు బంపరాఫర్ ప్రకటించాడు. దీంతో ఆయన ఫ్యాన్స్ ‘సరిలేరు నీకెవ్వరు’ అంటూ సూపర్ స్టార్‌ను సోషల్ మీడియా వేదికగా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

news18-telugu
Updated: November 28, 2019, 12:42 PM IST
అభిమానులకు మహేష్ బాబు బంపరాఫర్.. ‘సరిలేరు నీకెవ్వరు’ అంటున్న ఫ్యాన్స్..
మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ (Twitter/Photo)
  • Share this:
అభిమానులకు మహేష్ బాబు బంపరాఫర్ ప్రకటించాడు. దీంతో ఆయన ఫ్యాన్స్ ‘సరిలేరు నీకెవ్వరు’ అంటూ సూపర్ స్టార్‌ను సోషల్ మీడియా వేదికగా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో మహేష్ బాబు.. ఫస్ట్ టైమ్ ఒక ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ఫస్ట్ టైమ్.. మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు  ఒకప్పటి లేడీ సూపర్ స్టార్ విజయ్ శాంతి ఈ సినిమాతో నటిగా రీ ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుండి ప్రతి సోమవారం ఈ సినిమా విడుదల అయ్యేంత వరకు ఈ చిత్రానికి సంబంధించిన ఏదో ఒక అప్డేట్ ఇవ్వనున్నట్టు ఈ చిత్ర యూనిట్ ప్రకటించింది. మొత్తానికి సంక్రాంతి సినిమా ప్రచార రేసులో వెనకబడ్డ ఈ సినిమా ఇక నుండి సోషల్ మీడియా వేదికగా దూకుడు చూపించబోతుంది.
Published by: Kiran Kumar Thanjavur
First published: November 28, 2019, 12:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading