హోమ్ /వార్తలు /సినిమా /

Mahesh Babu: రియల్ బిజినెస్‌మెన్ మహేష్ బాబు.. వ్యాపారంలో సూపర్ స్టార్ రూటే సపరేటు!!

Mahesh Babu: రియల్ బిజినెస్‌మెన్ మహేష్ బాబు.. వ్యాపారంలో సూపర్ స్టార్ రూటే సపరేటు!!

మహేష్ బాబు (Mahesh Babu)

మహేష్ బాబు (Mahesh Babu)

Mahesh Babu Business: కృష్ణ వారసుడిగా సినీ ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు టాలీవుడ్ టాప్ స్టార్స్‌లో ఒకరిగా ఎదిగారు. రాజకుమారుడిగా కెమెరా ముందు తన టాలెంట్ చూపిస్తూ అంచలంచెలుగా ఎదిగి సూపర్ స్టార్ ఫ్యాన్ బేస్ పెంచేశారు. దీంతో పాటు వ్యాపార రంగంలో పైగా సత్తా చాటాలని ఫిక్సయిన మహేష్ బాబు.. తన భార్య నమ్రత సహకారంతో విభిన్నమైన వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

రాను రాను ట్రెండ్ మారుతూ వస్తోంది. సినీ సెలబ్రిటీలు తన రంగంలోనే గాక ఇతర రంగాల్లో కూడా రాణించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతూ ముందుకెళ్తున్నారు. ఈ లిస్టులో ఘట్టమనేని వారసుడు, సూపర్ స్టార్ కృష్ణ తనయుడు, టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు (Mahesh Babu) ముందు వరుసలో ఉన్నారు. ఎప్పటికప్పుడు వినూత్నంగా ఆలోచిస్తూ బిజినెస్ ప్లాన్స్ (Business Plans) చేస్తున్నారు మహేష్. సినీ రంగంతో పాటు ఇతరత్రా రంగాల్లో కూడా తన మార్క్ చూపించి బ్రాండ్ క్రియేట్ చేసుకుంటున్నారు.

కృష్ణ వారసుడిగా సినీ ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు టాలీవుడ్ టాప్ స్టార్స్‌లో ఒకరిగా ఎదిగారు. రాజకుమారుడిగా కెమెరా ముందు తన టాలెంట్ చూపిస్తూ అంచలంచెలుగా ఎదిగి సూపర్ స్టార్ ఫ్యాన్ బేస్ పెంచేశారు. దీంతో పాటు వ్యాపార రంగంలో పైగా సత్తా చాటాలని ఫిక్సయిన మహేష్ బాబు.. తన భార్య నమ్రత సహకారంతో విభిన్నమైన వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు. తాను రీల్ బిజినెస్‌మెన్ మాత్రమే కాదు రియల్ బిజినెస్‌మెన్ కూడా అని నిరూపించుకుంటున్నారు మహేష్ బాబు.

తాను సంపాదించిన డబ్బులను పలు వ్యాపారాలకు ఉపయోగిస్తూ అందరిలో తనది డిఫరెంట్ దారి ప్రూవ్ చేసుకుంటున్నారు. GMB ఎంటర్‌టైన్‌మెంట్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసి బిగ్ బడ్జెట్ సినిమాలు రూపొందిస్తున్న మహేష్.. AMB సినిమాస్ పేరుతో భారీ ఎత్తున మల్టిప్లెక్స్ థియేటర్ ఓపెన్ చేశారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన AMB సినిమాస్ ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీప్లెక్సులలో ఒకటి కావడం విశేషం.

బిజినెస్‌మెన్‌గా పైసా వసూల్ మార్గాలపై అన్వేషణ చేస్తూ కొత్త కొత్త ఆలోచనలను ఆచరణలో పెడుతున్నారు మహేష్ బాబు. ది హంబుల్ కో. పేరుతో వస్త్ర వ్యాపారంలో కూడా అడుగుపెట్టారు సూపర్ స్టార్. ఈ బ్రాండ్ క్లాత్స్‌కి ప్రస్తుతం మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఇన్ని రకాల వ్యాపారాల్లో రాణిస్తూనే మరో బిగ్ ప్లాన్ చేసిన మహేష్.. రీసెంట్ గా రెస్టారెంట్ వ్యాపారంలోకి అడుగు పెట్టారు. ప్రస్తుతం, భవిష్యత్ లో హోటల్ రంగానికి ఉన్న డిమాండ్ దృష్టిలో పెట్టుకొని ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు. తన భార్య నమ్రత పేరుతో హైదరాబాద్‌లో రెస్టారెంట్స్‌ ప్రారంభిస్తున్నారు మహేష్ బాబు.

ఏషియన్ గ్రూప్‌తో కలిసి హైదరాబాద్ లో భారీ స్థాయిలో ఈ లగ్జరీచయస్ రెస్టారెంట్ స్టార్ట్ చేస్తున్నారు మహేష్. ఈ రెస్టారెంట్‌కు ఏఎన్ అని నామకరణం కూడా చేశారు. ఏ అంటే ఏషియన్స్ అండ్ ఎన్ అంటే నమ్రత. ఈ కొత్త రెస్టారెంట్ బంజారా హిల్స్‌లోని టీఆర్ఎస్ భవనం పక్కన ఉంది. డిసెంబర్ 8న గ్రాండ్‌గా ఈ రెస్టారెంట్ ఓపెన్ కానుంది. మహేష్ వేస్తున్న ఈ అడుగులు చూసి సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. తమ అభిమాన హీరో సినిమాల్లోనే కాదు బిజినెస్ లో కూడా కింగ్ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. వ్యాపార పరంగా మహేష్ బాబు వెళుతున్న తీరును అభినందిస్తున్నారు.

బిజినెస్ చేయడంలోనే కాదు వ్యాపార ప్రకటనల్లో కూడా నటిస్తూ బాగా సంపాదిస్తున్నారు మహేష్ బాబు. ఇటీవలే సర్కారు వారి పాట సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న ఆయన ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ భారీ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తికాగానే దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మరో సినిమా పట్టెలక్కనుంది. సినీ రంగంతో పాటు వ్యాపార రంగంలో కూడా రాణిస్తున్న మహేష్ బాబుకు ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ అందిస్తున్న సహకారం మంచి బూస్టింగ్ అని చెప్పుకోవచ్చు.

First published:

Tags: Mahesh Babu, Namratha Shirodkar, Tollywood, Tollywood actor

ఉత్తమ కథలు