Mahesh Babu-Gautam | సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి ఫారెన్ టూర్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి వీలైన ప్రతి చోట తన కుమార్తె సితారతో పాటు కుమారుడు గౌతమ్ కృష్ణతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు. తాజాగా తన అబ్బాయి గౌతమ్ కృష్ణతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ సందర్భంగా ఫారెన్ టూర్లో భాగంగా తన తోడల్లుడు నమ్రత శిరోద్కర్ అక్క శిల్పా శిరోద్కర్ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా శిల్పా శిరోద్కర్ భర్త అప్రేశ్ రంజిత్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా అప్రేశ్ రంజిత్ కేక్ కట్ చేసే సందర్భంగా మహేష్ బాబుతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బర్త్ డే విషెస్ తెలియజేసారు. తన సోదరి శిల్పా శిరోద్కర్ భర్త అప్రేశ్ రంజన్ బర్త్ డే వేడుకలకు సంబంధించిన వీడియోను నమ్రత శిరోద్కర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇపుడీ వీడియోను మహేష్ బాబు అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు విషయానికొస్తే.. ఈ ఇయర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నట్టు ప్రకటించాడు. ఇప్పటికే సూపర్ స్టార్ కృష్ణ.. తన బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కరోనా లేకపోతే.. ఈ పాటికి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ షూటింగ్ కంప్లీటో కూడా అయ్యేది. కానీ ఈ సినిమాను వచ్చే యేడాది జనవరిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాను అమెరికా నేపథ్యంలో బ్యాంకు కుంభకోణాల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబును ఢీ కొట్టే విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ నటిస్తున్నాడు. ఈ చిత్రంలో మహేష్ బాబు తండ్రి కొడుకులుగా త్రిపాత్రాభినయం చేయనున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gautham Krishna, Mahesh babu, Namratha Shirodkar, Sarkaru vaari pata, Tollywood