హోమ్ /వార్తలు /సినిమా /

పూర్తిగా మారిపోయిన మహేష్ బాబు.. సాక్ష్యం ఇదిగో..

పూర్తిగా మారిపోయిన మహేష్ బాబు.. సాక్ష్యం ఇదిగో..

మహేష్ బాబు: సూపర్ స్టార్ చూడ్డానికి మిల్క్ బాయ్‌లా ఉంటాడు. ఇప్పటికీ ఆయన ఫిజిక్ అలాగే మెయింటేన్ చేస్తుంటాడు. మరి మహేష్ బాబుకు యిష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా.. ఈయనకు బిర్యానీ, చేపల

మహేష్ బాబు: సూపర్ స్టార్ చూడ్డానికి మిల్క్ బాయ్‌లా ఉంటాడు. ఇప్పటికీ ఆయన ఫిజిక్ అలాగే మెయింటేన్ చేస్తుంటాడు. మరి మహేష్ బాబుకు యిష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా.. ఈయనకు బిర్యానీ, చేపల

అవును టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇపుడు పూర్తిగా మారిపోయారు. ఇది వరకటిలా ఒకే మూసలో వెళ్లాలనుకోవడం లేదు. వివరాల్లోకి వెళితే.. తాజాగా మహేష్ బాబు..

  అవును టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇపుడు పూర్తిగా మారిపోయారు. ఇది వరకటిలా ఒకే మూసలో వెళ్లాలనుకోవడం లేదు. వివరాల్లోకి వెళితే.. ఈ ఇయర్ సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ మూవీ సక్సెస్ తర్వాత మహేష్ బాబు..పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ అనే సినిమాను తన తండ్రి కృష్ణ బర్త్ డే సందర్భంగా అనౌన్స్ చేసాడు. అంతేకాదు ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్‌కు  సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించాలనే ఆలోచనలో  ఉన్నాడు.అయితే మహేష్ బాబు తన సినిమాల విషయంలో చాలా సెంటిమెంట్స్ ఉన్నాయి. మహేష్ బాబు తన చిత్ర మూవీ ఓపెనింగ్‌కు కనిపించరు. గతంలో హాజరైన సినిమాలు ఫ్లాప్ కావడంతో అప్పటి నుంచి సినిమా ముహూర్తపు షాట్‌కు మాత్రం హాజరు కావడం లేదు. తన తరుపున తన ఇంట్లో వాళ్లు హాజరయ్యేలా చూస్తాడు. ఎక్కువగా మహేష్ బాబు నమ్రతతో పాటు పిల్లలు ముహూర్తపు సన్నివేశంలో పాల్గొంటున్నారు.

  మహేష్ బాబు ప్రొఫైల్ పిక్ (Twitter/Photo)

  అంతేకాదు ఎపుడు మహేష్ బాబు కొత్త లుక్‌ కోసం ట్రై చేయలేదు. ఏదో ‘పోకిరి’, ‘అతిథి’ సినిమాలపుడే మహేష్ బాబు కాస్త కొత్తగా కనిపించాడు. తాజాగా మహేష్ బాబు తన సోషల్ మీడియా అకౌంట్ అయిన ట్విట్టర్ డీపీని మార్చాడు. దీని వెనక ఏదైనా రీజన్ ఉందా అని అభిమానులు ఆలోచిస్తున్నారు. మహేష్ బాబు ఏది చేసినా.. దాని వెనక ఏదో సెంటిమెంట్ ఉండి ఉంటుంది. ఇపుడు డీపీ విషయంలో మహేష్ బాబు అదే సెంటిమెంట్ ఫాలో అయ్యాడా లేదా అనేది చూడాలి. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారు తన డీపీలను తరుచూ ఛేంజ్ చేస్తుంటారు. కానీ మహేష్ బాబు గత కొన్ని రోజులుగా ఒకే డీపీని కంటిన్యూ చేస్తున్నాడు. ఇపుడు డిస్‌ప్లే పిక్‌తో పాటు ప్రొఫైల్ పిక్‌ను మహేష్ బాబు ఛేంజ్ చేయడం విశేషం. మహేష్ బాబు ఇంత కాలానికైనా తన డీపీని ఛేంజ్ చేయడం చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

  మహేష్ బాబు సర్కారు వారి పాట లుక్ (sarkaru vaari pata movie)
  మహేష్ బాబు సర్కారు వారి పాట లుక్ (sarkaru vaari pata movie)

  ప్రస్తుతం మహేష్ బాబు.. పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్, నివేదా థామస్ నటిస్తున్నారు. మరోవైపు ఈ సినిమాలో మహేష్ బాబును ఢీ కొట్టే విలన్ పాత్రలో సుదీప్, ఉపేంద్ర, అరవింద్ స్వామి పేర్లను పరిశీలిస్తున్నారు. ‘సర్కారు వారి పాట’లో ముఖ్యంగా అవినీతికి సంబంధించిన ఓ సామాజిక అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించబోతున్నారని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థను కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా కథ ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఈ సినిమాలో వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని హీరో మహేష్ ఎలా తిరిగి రాబట్టాడు. దానికి సంబందించి ఆయన ఎలాంటి ప్రయత్నాలు చేశాడనేది ఈ సినిమా కథగా తెలుస్తోంది.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Mahesh babu, Sarkaru vaari pata, Tollywood

  ఉత్తమ కథలు