SUPER STAR MAHESH BABU BROTHER IN LAW GALLA JAYADEV SON GALLA ASHOK WILL GET INTRODUCED AS HERO BY SRIRAM ADITTYA PK
మహేష్ బాబు కుటుంబం నుంచి మరో హీరో.. నాగార్జున దర్శకుడితో..
గల్ల అశోక్ మహేష్ బాబు
ఇండస్ట్రీకి మరో వారసుడు వస్తున్నాడు.. ఈ సారి సూపర్ స్టార్ మహేష్ కుటుంబం నుంచి రాబోతున్నాడు. ఆయన పెద్ద బావ, గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా హీరోగా..
ఇండస్ట్రీకి మరో వారసుడు వస్తున్నాడు.. ఈ సారి సూపర్ స్టార్ మహేష్ కుటుంబం నుంచి రాబోతున్నాడు. ఆయన పెద్ద బావ, గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఈయన సినిమాను భారీగానే లాంఛ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. భలే మంచి రోజు,శమంతక మణి, దేవదాస్ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. నాని, నాగార్జున లాంటి అగ్ర హీరోలతో దేవదాస్ సినిమా చేసిన తర్వాత ఇప్పుడు అశోక్‌ను పరిచయం చేయబోతున్నాడు శ్రీరామ్ ఆదిత్య. ఈ సినిమా ఫ్లాప్ అయినా కూడా ఫన్ బాగానే అందించాడు ఈయన.
గల్ల అశోక్‌ను పరిచయం చేస్తున్న శ్రీరామ్ ఆదిత్య
అదే నమ్మకంతో ఇప్పుడు జయదేవ్ బాధ్యతలను ఈయన చేతుల్లో పెట్టారు గల్లా జయదేవ్. అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై పద్మావతి గల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈమె మహేష్ బాబుకు పెద్దక్క.. ఈ సినిమాలో సీనియర్ నరేష్, సత్య, అర్చన సౌందర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తుండగా రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. భిన్నమైన కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు శ్రీరామ్ ఆదిత్య. నవంబర్ 10న భారీగా ఈ చిత్రాన్ని లాంఛ్ చేయబోతున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.