యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే విషెస్..

ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ తెలియజేసారు. తాజాగా ఎన్టీఆర్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే విషెస్ తెలియజేసాడు.

news18-telugu
Updated: May 20, 2020, 2:36 PM IST
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే విషెస్..
మహేష్ బాబు, ఎన్టీఆర్ (File/Photos)
  • Share this:
ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ తెలియజేసారు. రామ్ చరణ్, చిరంజీవి, నారా లోకేష్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు యంగ్‌ టైగర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఎన్టీఆర్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే విషెస్ తెలియజేసాడు. వీళ్లిద్దరు మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే కదా. గతంలో ఎన్టీఆర్.. మహేష్ బాబు హీరోగా నటించిన ‘భరత్ అను నేను’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరైన సంగతి తెలిసిందే కదా. మరోవైపు ఎన్టీఆర్ మాత్రం మహేష్ బాబుతో శ్రీమంతుడు సినిమాను తెరకెక్కించిన కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ సినిమా చేసాడు. తాజాగా ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి.. మహేష్ బాబుతో నెక్ట్స్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఎన్టీఆర్.. తాతా ఎన్టీఆర్, బాబాయి బాలకృష్ణ వారసుడిగా సినీ రంగంలో ప్రవేశించి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అటు మహేష్ బాబు కూడా .. సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా అడుగుపెట్టి తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక మహేష్ బాబు, ఎన్టీఆర్ కలిసి నటిస్తే బాగుంటుందని ఇరు హీరోల అభిమానులు కోరుకుంటున్నారు.

First published: May 20, 2020, 2:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading