Mahesh Babu: మహేష్ బాబు చేసిన ఆ పనికి ఆశ్యర్యపోతున్న ఫ్యాన్స్..

మహేష్ బాబు (Mahesh Babu)

Super Star Mahesh Babu | సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన పనికి ఇపుడు ఆశ్చర్యపోవడం అభిమానుల వంతు అయింది. తెలుగు ఇండస్ట్రీలో హీరో మహేష్ బాబుకు అజాతశత్రువు అనే పేరుంది.

  • Share this:
    Super Star Mahesh Babu | సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన పనికి ఇపుడు ఆశ్చర్యపోవడం అభిమానుల వంతు అయింది. తెలుగు ఇండస్ట్రీలో హీరో మహేష్ బాబుకు అజాతశత్రువు అనే పేరుంది. ఇండస్ట్రీలో నొప్పించక.. తానొవ్వక అన్నట్టు తన పని తాను చేసుకుంటూ పోవడమే మహేష్ బాబు సక్సెస్ సీక్రెట్ అని అందరు చెప్పుకుంటూ ఉంటారు. అలాంటిది మహేష్ బాబుకు పూరీ జగన్నాథ్ విషయంలో మాత్రం కొన్ని రోజులుగా మాటలు లేవనేది ఆయన సన్నిహితులు చెబుతుంటారు. మహేష్ బాబుకు పోకిరి, బిజినెస్ మేన్’ వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన పూరీ జగన్నాథ్‌.. ఆ తర్వాత ముచ్చటగా మహేష్ బాబుతో మూడో సినిమాగా ‘జనగణమన’ను తెరకెక్కిస్తున్నట్టు పూరీ ప్రకటించాడు. కానీ ఈ సినిమా విషయంలో పూరీ వినిపించిన కథ విన్న మహేష్ బాబు .. ఔను అని చెప్పలేదు. కాదు అని చెప్పలేదు. ఈ సినిమా విషయమై పూరీ జగన్నాథ్.. మూడు నాలుగు సార్లు ప్రకటించినా.. మహేష్ బాబు నుంచి సమాధానం రాకపోవడంతో పూరీ జగన్నాథ్ సైలెంట్ అయిపోయాడు.


    ఆ తర్వాత  పూరీ జగన్నాథ్ ఏదో సినిమా ఫంక్షన్‌లో మాట్లాడుతూ... ఏదైనా విషయం ఉంటే.. ఔను అని చెప్పాలి  లేదా కాదని చెప్పాలి. కానీ ఏది చెప్పకుండా సైలెంట్‌గా కొంత మంది ఉంటారు అని మహేష్ బాబు పై ఇన్ డైరెక్ట్‌గా సెటైర్స్ వేసాడు. ఆ తర్వాత మహేష్ బాబు .. హీరోగా ఆయన 25 చిత్రం ‘మహర్షి’ సినిమా వేడుకలో తనతో సినిమాలు తెరకెక్కించిన అందరు దర్శకుల పేర్లు ప్రస్తావించినా.. పూరీ జగన్నాథ్ పేరు మాత్రంప్రస్తావించలేదు.  ఆ తర్వాత రోజు మహేష్ బాబు.. ట్విట్టర్‌లో పూరీ జగన్నాథ్‌ పేరును మరిచిపోయినందకు క్షమాపణలు కోరాడు. ఇక రాజకీయాల్లో సినిమాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత మిత్రులు ఉండరన్నట్టు ఇపుడు మహేష్ బాబు, పూరీ జగన్నాథ్ మధ్య ఉన్న ఆ గొడవలు సద్దుమణినట్టు సమాచారం. అంతేకాదు అప్పట్లో మహేష్ బాబు నో చెప్పిన ‘జనగణమన’ సినిమాను కాస్తంత మార్పుల చేసి మహేష్ బాబుతో పూరీ ఆ కథను ఓకే చేయించుకున్నట్టు సమాచారం.

    mahesh babu puri jagannath businessman mahesh babu puri jagannadh puri jagannath mahesh movie puri jagannath and mahesh babu puri jagannadh about mahesh puri jagannath mahesh babu puri jagannadh interview mahesh babu mahesh babu puri jagannadh film mahesh babu puri jagannadh movies mahesh babu puri jagannadh mahesh babu and puri jagannadh movies puri jagannath on mahesh babu mahesh babu puri jagannadh twitter,పూరితో మరోసారి మహేష్,
    మహేష్, పూరి Photo : Twitter


    త్వరలో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో మూడో సినిమాకు రంగం సిద్ధం అవుతోందనే సమాచారం ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో వినబడుతోంది. అందుకే ఇన్ని రోజులు పూరీ విషయంలో సైలెంట్‌గా ఉన్న మహేష్ బాబు.. ఈ రోజు ఆయన బర్త్ డే సందర్భంగా పూరీకి బర్త్ డే విషెస్ తెలియజేసినట్టు అందరు చెప్పుకుంటున్నారు.  అంతేకాదు తన ఫేవరేట్ దర్శకుల్లో పూరీ జగన్నాథ్ ఒకరిని ట్వీట్ చేసారు.  ఇది చూసి మహేష్ బాబు అభిమానులు సైతం ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దర్శకుడు పూరీ జగన్నాథ్ బర్త్ డే సందర్భంగా పలువురు హీరోలు, దర్శకులు ఆయనకు వివిధ సామాజిక మాధ్యమాల వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: