హోమ్ /వార్తలు /సినిమా /

Mahesh Babu : కుటుంబంతో కలిసి ఫారిన్ టూర్ వెళ్లిన సూపర్ స్టార్ మహేష్ బాబు..

Mahesh Babu : కుటుంబంతో కలిసి ఫారిన్ టూర్ వెళ్లిన సూపర్ స్టార్ మహేష్ బాబు..

ఫ్యామిలీతో కలిసి ఫారెన్ టూర్ వెళ్లిన మహేష్ బాబు (Twitter/Photo)

ఫ్యామిలీతో కలిసి ఫారెన్ టూర్ వెళ్లిన మహేష్ బాబు (Twitter/Photo)

Mahesh Babu : కుటుంబంతో కలిసి ఫారిన్ టూర్ వెళ్లిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఈ సందర్భంగా అక్కడ దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.

Mahesh Babu- Sarkaru Vaari Paata | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు‌ తన ఫ్యామిలీతో కలిసి ఫారెన్ టూర్‌ నిమిత్తం ప్యారిస్  వెళ్లాడు. ఈ సందర్భంగా అక్కడి తన ఫ్యామిలీ మెంబర్స్‌తో ఓ హోటల్‌లో లంచ్ చేస్తోన్న ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకున్నారు. మహేష్ బాబు ముందు నుంచి వీలైన ప్రతి చోట తన కుమార్తె సితారతో పాటు కుమారుడు గౌతమ్ కృష్ణతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తునే ఉన్న సంగతి తెలిసిందే కదా. మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వమంలో చేసిన ‘సర్కారు వారి పాట’ షూటింగ్‌ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి కావడంతో ఈ లోపు ఫారెన్ ట్రిప్ నిమిత్తం ఫ్యారిస్ వెళ్లారు. అక్కడ నుంచి పలు పర్యాటక ప్రదేశాలను సందర్శించనున్నారు.

రీసెంట్‌గా సర్కారు వారి పాట సినిమా నుంచి విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా విడుదలకు మరో 8 రోజులు మాత్రమే మిగిలి ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన సర్కారు వారి పాట ట్రైలర్ సోషల్ మీడియాలో నెంబర్ వన్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. తాజాగా ఈ సినిమా యూఎస్‌లో మరో రికార్డు క్రియేట్ చేస్తోంది. అక్కడ 603 లోకొనేషన్స్‌లో విడుదల కాబోతున్నట్టు ప్రకటించారు.  ప్యాన్ ఇండియా సినిమాలు తప్పించి తెలుగులో ఓ సినిమా ఈ రేంజ్‌లో ఇన్ని లోకేషన్స్‌లో విడుదల కావడం ఇదే ఫస్ట్ టైమ్. దీంతో మహేష్ బాబు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక తెలుగు సినిమాల విషయానికొస్తే.. ఒకేసారి తెలుగుతో పాటు ఓవర్సీస్‌లో పోకిరి సినిమా విడుదలైంది. ఆ తర్వాత తెలుగు సినిమాలుక ఓవర్సీస్ మార్కెట్ కీలకంగా మారింది. ఒక రకంగా తెలుగులో అత్యధికంగా ఓవర్సీస్‌లో 1 మిలియన్ డాలర్స్ పైగా వసూళ్లు సాధించిన చిత్రాల్లో మహేష్ బాబు చిత్రాలే ఎక్కువగా ఉన్నాయి. తాజాగా ‘సర్కారు వారి పాట’ సినిమాతో మహేష్ బాబు యూఎస్‌లో మరో రికార్డుకు రెడీ అవుతున్నారు.

RRR - Jr NTR : RRRతో రామ్ చరణ్‌, ప్రభాస్‌, యశ్‌లకు సాధ్యం కానీ రికార్డుకు క్రియేట్ చేసిన ఎన్టీఆర్..


ఇప్పటికే ఈ సినిమా నుంచి  నుంచి కళావతి అనే సాంగ్‌‌ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. థమన్ స్వరపరిచిన ఈ మెలోడీ సాంగ్ ఇప్పటి వరకు ఈ సినిమా యూట్యూబ్‌లో 150 మిలియన్ పైగా  వ్యూస్ రాబట్టి దూసుకుపోతోంది.  ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాయగా.. సిద్ శ్రీరామ్ పాడారు.  థమన్ (Thaman) సంగీతం అందించారు. పాటలో విజువల్స్ బాగున్నాయి. ఈ పాట విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.సర్కారు వారి పాట సినిమా 24 గంటల్లోనే 26 మిలియన్ వ్యూస్ 1.2 లైక్స్‌తో 24 గంటల్లో అత్యధిక మంది వీక్షించిన ట్రైలర్‌గా రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమాపై టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి.

First published:

Tags: Mahesh Babu, Sarkaru Vaari Paata, Tollywood

ఉత్తమ కథలు