హోమ్ /వార్తలు /సినిమా /

మహేష్ బాబు నిజంగానే ఆ పని చేసే సాహసం చేస్తాడా.. అసలు సాధ్యమేనా..

మహేష్ బాబు నిజంగానే ఆ పని చేసే సాహసం చేస్తాడా.. అసలు సాధ్యమేనా..

మహేష్ బాబు: సూపర్ స్టార్ చూడ్డానికి మిల్క్ బాయ్‌లా ఉంటాడు. ఇప్పటికీ ఆయన ఫిజిక్ అలాగే మెయింటేన్ చేస్తుంటాడు. మరి మహేష్ బాబుకు యిష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా.. ఈయనకు బిర్యానీ, చేపల

మహేష్ బాబు: సూపర్ స్టార్ చూడ్డానికి మిల్క్ బాయ్‌లా ఉంటాడు. ఇప్పటికీ ఆయన ఫిజిక్ అలాగే మెయింటేన్ చేస్తుంటాడు. మరి మహేష్ బాబుకు యిష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా.. ఈయనకు బిర్యానీ, చేపల

మహేష్ బాబు నిజంగానే ఆ పని చేసే సాహసం చేస్తాడా.. అసలు ఆ పని  సాధ్యమేనా అని అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

    మహేష్ బాబు నిజంగానే ఆ పని చేసే సాహసం చేస్తాడా.. అసలు ఆ పని  సాధ్యమేనా అని అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఈ ఇయర్ మహేష్ బాబు.. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్ కారణంగా అందరితో పాటు ఇంట్లోనే ఉన్నాడు. ఇక మహేష్ బాబు నెక్ట్స్ మూవీ వంశీ పైడిపల్లితో అనుకున్నా.. ఆ సినిమాను హోల్డ్‌లో పెట్టి పరుశురామ్‌తో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు. డిసెంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. కీర్తి సురేష్, నివేదా థామస్ ఈ సినిమాలో కథానాయికలుగా నటిస్తున్నారు. బ్యాంకింగ్ రంగం నేపథ్యంలో  రివేంజ్ ఫార్మాలాతో ఇప్పటి వరకు తెలుగు తెరపై  ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో మహేష్ బాబు తండ్రి కొడుకులుగా త్రిపాత్రభినయం చేయనున్నట్టు సమాచారం. ’సర్కారు వారి పాట’ తర్వాత 2022లో రాజమౌళితో చేయబోయే సినిమా ఉండనే ఉంది. వీటితో పాటు మహేష్ బాబుకు ఒక కోరిక ఉంది. ఇప్పటికే దానికి సంబంధించిన కథను రెడీ చేయిస్తున్నట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే.. అక్కినేని ఫ్యామిలీ హీరోలందరు  కలిసి నటించిన సినిమా ‘మనం’. ఢిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ‘మనం’ చిత్రంలో అక్కినేని మూడు తరాల హీరోలైన అక్కినేని నాగేశ్వర రావు, నాగార్జున, నాగ చైతన్య, చివర్లో అఖిల్ ఈ సినిమాలో ఒకే స్క్రీన్‌లోకనిపించి అభిమానులకు కనువిందు చేసారు.  ముందుగా అనుకోకపోయినా.. అక్కినేని వాళ్లింటి కోడలైన సమంత కూడా ‘మనం’ చిత్రంలో అక్కినేని హీరోలతో కలిసి నటించిడం యాదృచ్చికమనే చెప్పాలి.

    మనం సినిమాలో అక్కినేని ఫ్యామిలీ హీరోలు (Twitter/Photo)

    ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్టైయింది. ఆ తర్వాత మోహన్ బాబుకు చెందిన మంచు ఫ్యామిలీ హీరోలు మనోజ్, విష్ణులు కలిసి ‘పాండవులు పాండవులు తుమ్మెదా’ అనే చిత్రంలో కలిసి నటించారు. ఈ చిత్రంలో మంచు లక్ష్మీ గెస్ట్ పాత్రలో మెరిసింది. తాజాగా మహేష్ బాబు కూడా తండ్రి సూపర్ స్టార్‌ కృష్ణతో పాటు కొడుకు గౌతమ్ కృష్ణతో ఇలాంటి సబ్జెక్ట్‌తో ఓ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.  ఇప్పటికే దానికి సంబంధించిన కథ ఉంటే రెడీ చేయమని రచయతలతో పాటు దర్శకులకు చెప్పినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

    mahesh babu wife namrata emotional tweet go viral on social media,namrata shirodkar,mahesh babu,mahesh babu namrata shirodkar,mahesh babu sarileru neekevvaru,mahesh babu twitter,mahesh babu instagram,mahesh babu facebook,namrata shirodkar twitter,namrata shirodkar instagram,namrata shirodkar facebook,mahesh babu family,mahesh babu movies,mahesh babu about namrata,mahesh babu wife,mahesh babu wife namrata,mahesh babu marriage with namrata shirodkar,mahesh babu wife namrata shirodkar exclusive visuals,mahesh babu unseen,namrata,namrata shirodkar and mahesh babu,mahesh babu movies in telugu,namrata shirodkar mahesh babu love story,mahesh babu namrata wedding,tollywood,telugu cinema,మహేష్ బాబు,మహేష్ బాబు నమ్రత శిరోద్కర్,నమ్రత శిరోద్కర్,మహేష్ బాబు నమ్రత శిరోద్కర్,మహేష్ బాబు,నమ్రత శిరోద్కర్,మహేష్ బాబు చిరంజీవి,సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్
    సూపర్ స్టార్స్ కృష్ణ,మహేష్ బాబు,గౌతమ్ కృష్ణ (Twitter/Photo)

    టాలీవుడ్ సూపర్ స్టార్స్ అయిన కృష్ణ, మహేష్ బాబు, నమ్రత, గౌతమ్, సితార అందరు కూడా ఈ చిత్రంలో నటించనున్నట్టు సమాచారం.  ఈ చిత్రాన్ని వీలైతే వంశీ పైడిపల్లితో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ కూడా కీలక పాత్రలో నటించబోతున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమాలో నమ్రత, మహేష్ బాబు పిల్లలు కథకు అనుగుణంగా ఉండే పాత్రల్లో నటించబోతున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. కానీ ప్రస్తుతం కృష్ణగారి ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఆయన నటిస్తారా అనేది కొంచెం డౌట్‌గా ఉంది. గతంలో మహేష్ బాబు చిన్నపుడు కృష్ణ నటించిన చాలా చిత్రాల్లో ముఖ్యపాత్రల్లో నటించారు. ఇక మహేష్ బాబు పూర్తి స్థాయి హీరోగా మారిన తర్వాత రాజకుమారుడు, వంశీ, టక్కరి దొంగ సినిమాల్లో తండ్రి కృష్ణతో కలసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

    Super Star Mahesh Babu wife Namrata Shirodkar sensational comments On his Political Entry, Tollywood Super Star Mahesh Babu wife Namrata Shirodkar sensational comments On Her Husband Political Entry, Namrata Shirodkar Clarity About Mahesh Babu Political Entry, Mahesh babu Political Entry | తాజాగా రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్న హీరోల లిస్టులో మహేశ్ బాబు కూడా చేరబోతున్నాడా ? అంటే దీనికి కొన్ని మీడియా సంస్థలు ఔననే సమాధానాలు వస్తున్నాయి. తాజాగా మహేశ్ బాబు పొలిటికల్ ఎంట్రీపై ఆయన భార్య నమ్రత క్లారిటీ ఇచ్చింది. మహేష్ బాబు పొలిటికల్ ఎంట్రీపై నమ్రత సంచలన వ్యాఖ్యలు.., Mahesh Babu, mahesh babu Political, mahesh babu political entry, Namrata Shirodkar Clarity About Mahesh Babu Political Entry, Mahesh babu namrata shirodkar, Tollywood News, telugu Cinema, మహేష్, మహేష్ బాబు, మహేశ్ బాబు పొలిటికల్ ఎంట్రీ, మహేశ్ బాబు పొలిటిక్స్, రాజకీయాల్లో మహేశ్ బాబు, మహేశ్ బాబు రాజకీయం, మహేశ్ బాబు పొలిటికల్ ఎంట్రీపై నమ్రత క్లారిటీ
    భార్య పిల్లలతో మహేశ్ బాబు

    ఇందులో వంశీ సినిమాలో అటు తండ్రి కృష్ణ, ఇటు భార్య నమ్రత కలిసి నటించిన సంగతి తెలిసిందే కదా. మొత్తానికి ఫిల్మ్ సర్కిల్స్‌లో వినపడుతున్నట్టు ఘట్టమనేని ఫ్యామిలీ హీరోలందరు ఒకే సినిమాలో కలిసి నటిస్తే చూడాలనుకునే అభిమానులు ప్రేక్షకులు చాలా మందే ఉన్నారు. ఒకే వేళ నటిస్తే.. అక్కినేని హీరోల తర్వాత తెలుగులో ఒకే సినిమాలో కలిసి నటించిన మూడు తరాల హీరోలుగా ఘట్టమనేని మిగిలిపోనుంది. హిందీలో మాత్రం కపూర్ ఫ్యామిలీ హీరోలు పృథ్వీ రాజ్ కపూర్, రాజ్ కపూర్,రణ్‌దీర్ కపూర్‌లు ‘కల్ ఆజ్ ఔర్ కల్’ సినిమాలో మూడు తరాలు కలిసి నటించిన సంగతి తెలిసిందే కదా.

    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Krishna, Mahesh babu, Namrata, Sarkaru vaari pata, Tollywood

    ఉత్తమ కథలు