Home /News /movies /

SUPER STAR KRISHNA SON IN LAW MAHESH BABU BROTHER IN LAW SUDHEER BABU WILL BUILD STUDIO TA

సూపర్ స్టార్ కృష్ణ బాటలో సుధీర్ బాబు.. త్వరలోనే ఆ పనికి శ్రీకారం..

సూపర్ స్టార్ కృష్ణ,సుధీర్ బాబు (File/Photo)

సూపర్ స్టార్ కృష్ణ,సుధీర్ బాబు (File/Photo)

మామ సూపర్ స్టార్ కృష్ణ బాటలో త్వరలో ఆ పని చేయడానికి రెడీ అవుతున్నాడు ఆయన చిన్నల్లుడు సుధీర్ బాబు.

    మామ సూపర్ స్టార్ కృష్ణ బాటలో త్వరలో ఆ పని చేయడానికి రెడీ అవుతున్నాడు ఆయన చిన్నల్లుడు సుధీర్ బాబు. సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు పేరుతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సుధీర్ బాబు. ప్రస్తుతం ఈయన నానితో కలిసి ‘వీ’ అనే సినిమా చేసాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ సినిమా విడుదల కాలేదు. ప్రస్తుతం సినిమా షూటింగ్స్ లేకపోవడంతో సుధీర్ బాబు తన ఫిట్‌నెస్ పై దృష్టి పెట్టాడు. తాజాగా ఈయన త్వరలో మామ కృష్ణగారిలా ఓ స్టూడియోను నిర్మించాలనే ఆలోచనలో ఉన్నట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.  ఇప్పటికే తెలుగులో ఎన్టీఆర్ రామకృష్ణ సిన స్టూడియోస్, అక్కినేని సంబంధించిన అన్నపూర్ణ స్టూడియో, కృష్ణకు సంబంధించిన పద్మాలయా స్టూడియోస్‌ ఉన్న సంగతి తెలిసిందే కదా. ఇపుడు సుధీర్ బాబు కట్టబోతున్న ఈ స్టూడియోను ఏపీలో పెడతాడా ? లేకపోతే తెలంగాణలో పెడతాడా అనేది చూడాలి. ఇప్పటికే స్టూడియో కోసం  అనువైన స్థలం కోసం సుధీర్ బాబు అన్వేషణ మొదలుపెట్టినట్టు సమాచారం. త్వరలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Krishna, Mahesh babu, Sudheer Babu, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు