హోమ్ /వార్తలు /సినిమా /

RIP Krishna: ఏలూరు నుంచి ఎంపీ.. కాంగ్రెస్‌తో అనుబంధం.. కృష్ణ రాజకీయ ప్రస్థానమిదే

RIP Krishna: ఏలూరు నుంచి ఎంపీ.. కాంగ్రెస్‌తో అనుబంధం.. కృష్ణ రాజకీయ ప్రస్థానమిదే

కృష్ణ (పాతచిత్రం)

కృష్ణ (పాతచిత్రం)

RIP Krishna: 1991 లోక్‌సభ ఎన్నికల్లో కృష్ణ గుంటూరు ఎంపీ టికెట్ ఆశించినప్పటికీ.. పార్టీ మాత్రం మళ్లీ ఏలూరు నుంచే పోటీ చేయించింది. ఆ ఎన్నికల్లో కృష్ణ ఓటమి పాలయ్యారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna).. సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించారు. ఏలూరు లోక్‌సభ స్థానం నుంచి గతంలో ఆయన ఎంపీగానూ పనిచేశారు. 1972లో కృష్ణ రాజకీయ ప్రస్థానం మొదలయింది. అప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకున్నప్పటికీ... జై ఆంధ్ర ఉద్యమానికి కృష్ణ బహిరంగ మద్దతు ప్రకటించారు. ఆ తర్వాతి నుంచి రాజకీయాలపై ఆసక్తి కనబరిచారు కృష్ణ. 1982లో కృష్ణ హీరోగా వచ్చిన రాజకీయ చిత్రం "ఈనాడు" సినిమా.... అప్పుడే పుట్టిన తెలుగుదేశం పార్టీ (TDP) సిద్ధాంతాలకు, ప్రచారానికి అనుకూలంగా ఉంది. ఎన్నికలకు సరిగ్గా మూడు వారాల ముందు ఈనాడు సినిమా విడుదలయింది. ఆ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. తెలుగుదేశం ప్రభంజనంలో ఈనాడు సినిమా తన వంతు పాత్ర పోషించింది. అనంతరం 1983లో ఎన్టీరామారావు ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారు.

 దివికేగిన నటశేఖరుడు.. సూపర్ స్టార్ కృష్ణ సినీ ప్రస్థానం..

ఐతే 1984లో ఎన్టీఆర్ (NTR) ప్రభుత్వాన్ని నాదెళ్ల భాస్కరరావు కూల్చేసి.. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అనంతరం భాస్కరరావును కృష్ణ అభినందిస్తున్నట్టు వార్తా పత్రికల్లో ఫుల్‌పేజీ ప్రకటన విడుదల చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ ఘటనతో కృష్ణ, రామారావు మధ్య విభేదాలు తలెత్తాయి. ఇద్దరి మధ్య దూరం పెరిగింది. 1984 ఎన్నికల్లో తిరిగి ఎన్టీఆర్ సీఎం అయ్యాక.. ఈ విభేదాలు మరింత పెరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి కృష్ణ దగ్గరయ్యారు. రాజీవ్ గాంధీ ఆహ్వానం మేరకు 1984లో కాంగ్రెస్లో చేరారు. ఆ తర్వాత ప్రభుత్వ చర్యలను వ్యంగ్యంగా విమర్శిస్తూ కృష్ణ పలు సినిమాలు చేశారు. 1989లో కృష్ణ కాంగ్రెస్ తరఫున ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు. 1991 లోక్‌సభ ఎన్నికల్లో కృష్ణ గుంటూరు ఎంపీ టికెట్ ఆశించినప్పటికీ.. పార్టీ మాత్రం మళ్లీ ఏలూరు నుంచే పోటీ చేయించింది. ఆ ఎన్నికల్లో కృష్ణ ఓటమి పాలయ్యారు. 1991లో రాజీవ్ గాంధీ హత్యకు గురికావడంతో ప్రత్యక్ష రాజకీయాల నుంచి ఆయన తప్పుకున్నారు. 2009 ఎన్నికల్లో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీకి కృష్ణ కుటుంబం నైతిక మద్దతు ప్రకటించింది.

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ఇవాళ తెల్లవారుఝామున 4 గంటలకు తుది శ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో 80 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశారు. నిన్న గుండెపోటు, శ్వాస ఇబ్బందులతో హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో కృష్ణ అడ్మిట్ అయ్యారు. శరీరంలోని ప్రధానమైన అవయవాలేవీ పనిచేయలేదు. వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ.. ఆయన (RIP Krishna) కోలుకోలేదు. వైద్యానికి శరీరం సరిగా స్పందించలేదు. క‌ృష్ణ ఆరోగ్య విషమంగానే ఉందని నిన్న మధ్యాహ్నం డాక్టర్లు కూడా చెప్పారు. 48 గంటలు గడిస్తే గానీ.. ఏమీ చెప్పలేదని తెలిపారు. కృష్ణ కోలుకోవాలని అభిమానులంతా పూజలు చేశారు. కానీ వైద్యులు ప్రయత్నాలు గానీ.. అభిమానుల పూజలు గానీ ఫలించలేదు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు కృష్ణ. కృష్ణ మరణవార్తతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. సినీ పెద్దలు దిగ్భ్రాంతికి గురయ్యారు. అభిమానులు కంటతడి పెట్టుకుంటున్నారు.

First published:

Tags: Krishna, Super Star Krishna, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు