Home /News /movies /

SUPER STAR KRISHNA MAHESH BABU WIFE NAMRATA BIRTHDAY WISHES TO KRISHNA MANY OTHERS WISHES TO SUPER STAR TA

HBD Super Star Krishna : సూపర్ స్టార్‌ కృష్ణకు కోడలు నమ్రత సహా సినీ, రాజకీయ ప్రముఖుల శుభాకాంక్షలు వెల్లువ..

సూపర్ స్టార్ కృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు (Twitter/Photo)

సూపర్ స్టార్ కృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు (Twitter/Photo)

Happy Birthday  Super Star Krishna : ఈ రోజు టాలీవుడ్ సూపర్ స్టార్‌గా ఒక వెలుగు వెలిగిన నట శేఖర కృష్ణ పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

    Happy Birthday  Super Star Krishna : ఈ రోజు టాలీవుడ్ సూపర్ స్టార్‌గా ఒక వెలుగు వెలిగిన నట శేఖర కృష్ణ పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ కోవలో సూపర్ స్టార్ కృష్ణ చిన్న తనయుడు మహేష్ బాబు భార్య నమ్రత .. తన ఇన్‌స్టాగ్రామ్‌లో మామగారైన సూపర్ స్టార్‌ కృష్ణతో గౌతమ్, సితారతో కలిసి ఉన్న ఫోటోను అభిమానులతో షేర్ చేసుకుంటూ బర్త్ డే విషెస్ తెలియజేసారు. ఆయన తనకు మామగారే కాదు.. తన గురువు.. మెంటర్ అంటూ చెప్పుకొచ్చారు.అటు మహేష్ బాబు కూడా తండ్రి సూపర్ స్టార్‌ కృష్ణకు బర్త్ డే విషెస్ తెలియజేసారు. సూపర్ స్టార్ కృష్ణ విషయానికొస్తే.. తెలుగు సినీ చరిత్రలో సంచనాలు సృష్టించిన సూపర్‌స్టార్‌. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగానే కాకుండా తెలుగు సినిమాకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఘనుడూ ఈయనే.

    అన్నింటికి మించి ప్రయోగాలకు కేరాఫ్‌గా నిలిచిన సాహసి. అంతేకాదు తెలుగు సినీ ప్రేక్షకులకు ఆయనే ఫస్ట్ కౌబాయ్, జేమ్స్ బాండ్ హీరో కూడా అతనే. టెక్నికల్ గా తెలుగు సినిమాను ఎన్నో ఎత్తులకు చేర్చిన నటుడు సూపర్ స్టార్ కృష్ణ.










    సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ సూపర్ స్టార్ కృష్ణ. సినిమాలో రాణించాలంటే నాటకాల్లో ఫ్రూవ్‌ చేసుకోవాలని కొంతమంది సినీ ప్రముఖులు ఇచ్చిన సలహాతో నాటకాల్లో వేషాలు వేయడం ప్రారంభించారు. 1960లో కృష్ణ తొలిసారిగా స్టేజ్‌ మీద 'చేసిన పాపం కాశీకెళ్ళినా' అనే నాటకంలో నటించారు. ఇందులో శోభన్‌బాబు కూడా నటించడం విశేషం.ఆ తర్వాత 'భక్త శబరి', 'సీతారామ కళ్యాణం', 'ఛైర్మన్‌' వంటి నాటకాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు.

    HBD Super Star Krishna : తెలుగు సినీ టార్చ్‌బేరర్ సూపర్ స్టార్ కృష్ణ.. అన్నింట్లో ముందు నటశేఖరుడే..

    కృష్ణ తొలిసారి హీరోగా ఎంపికైన చిత్రం 'కొడుకులు కోడళ్ళు'. కొన్ని కారణాల వల్ల ఇది ఆగిపోయింది. 'మూగ మనసులు' చిత్రం విడుదలైన తర్వాత 'తేనె మనసులు' కోసం నూతన నటీనటులు కావాలనే పేపర్‌ యాడ్‌ చూసి ఆడిషన్‌కి వెళ్ళి ఎంపికయ్యారు. హీరోగా ఎంపికైనప్పటికీ బక్కగా ఉన్నావు, నువ్వేం నటిస్తావని చాలా మంది దెప్పిపోడిచారట. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు జడ్జ్‌మెంట్‌ తప్పన్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Namrata Ghattamaneni, Super Star Krishna, Tollywood

    తదుపరి వార్తలు