SUPER STAR KRISHNA COMMENTS ON MAHESH BABU GLAMOUR SLB
అందుకే మహేష్ బాబు అలా ఉన్నాడు.. తండ్రి కృష్ణ ఓపెన్ అయ్యారిలా!!
Photo Twitter
హీరోల గ్లామర్ గురించి చెప్పాలంటే ఎవ్వరైనా ముందుగా ప్రస్తావించే పేరు మహేష్ బాబు. సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా సిల్వర్ స్క్రీన్‌పై అడుగుపెట్టిన ఆయన తెలుగు తెరపై తనదైన మార్క్ క్రియేట్ చేశారు. ఆరడుగుల అందగాడిగా ఫిమేల్ ఆడియన్స్ మనసు దోచుకున్నారు. ఈ క్రమంలో తాజాగా మహేష్ అందంపై కృష్ణ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
సినీ ప్రపంచంలో గ్లామర్ అనేది మూలం. వెండితెరపై గ్లామర్‌గా కనిపించడం అనేది ప్రతి ఒక్క ఆర్టిస్ట్ గోల్ కూడా. అయితే అందచందాల విషయం గురించి మాట్లాడేటప్పుడు ఎక్కువగా హీరోయిన్స్ టాపికే వస్తుంది. కానీ హీరోల గ్లామర్ గురించి చెప్పాలంటే ఎవ్వరైనా ముందుగా ప్రస్తావించే పేరు మహేష్ బాబు (Mahesh Babu). సూపర్ స్టార్ కృష్ణ (Krishna) తనయుడిగా సిల్వర్ స్క్రీన్‌పై అడుగుపెట్టిన ఆయన తెలుగు తెరపై తనదైన మార్క్ క్రియేట్ చేశారు. ఆరడుగుల అందగాడిగా ఫిమేల్ ఆడియన్స్ మనసు దోచుకున్నారు మహేష్. హీరోల అభిమానుల పరంగా చూస్తే ఫిమేల్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉంది ఒక్క మహేష్ బాబుకే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
రాజకుమారుడిగా వెండితెరపై సక్సెస్ఫుల్ జర్నీ కొనసాగిస్తున్న మహేష్ వయసు 46 సంవత్సరాలు అంటే ఏ ఒక్కరూ నమ్మరు. ఇప్పటికీ యువకుడిగా సిల్వర్ స్క్రీన్‌కి మేల్ గ్లామర్ టచ్ అద్దుతూ పలు సూపర్ డూపర్ హిట్స్ ఖాతాలో వేసుకుంటున్నారు మహేష్. అయితే వయసు పెరుగుతుంటే ఆయన అందం కూడా రెట్టింపవుతుండటం వెనుక సీక్రెట్ ఏంటి అనేది ప్రతి ఒక్కరికీ ఆసక్తికర అంశమే. తాజాగా అదే రివీల్ చేస్తూ ఫన్నీ కామెంట్స్ చేశారు మహేష్ బాబు తండ్రి, సీనియర్ హీరో కృష్ణ.
మహేష్ బాబు లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట చూసిన కృష్ణ ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని చెబుతూ ఓపెన్ అయ్యారు. ఎవరెన్ని రకాలుగా మాట్లాడినా సినిమా మాత్రం చాలా బాగుందని చెబుతూనే మహేష్ గ్లామర్‌పై రియాక్ట్ అయ్యారు. మహేష్ బాబు తన ఫిజిక్‌పై స్పెషల్ కేర్ తీసుకుంటారని, సినిమాలు లేని సమయంలో రెగ్యులర్‌గా జిమ్‌కు వెళ్తుంటాడని చెప్పిన చెప్పిన కృష్ణ.. అలా మెయింటెయిన్ చేస్తున్నాడు కాబట్టే ఇంత అందంగా ఉన్నాడంటూ నవ్వుతూ చెప్పారు.
సర్కారు వారి పాట సినిమా విషయానికొస్తే.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు జంటగా కీర్తి సురేష్ నటించింది. విడుదలకు ముందు నుంచే నెలకొన్న హైప్ సినిమాకు భారీ ఓపెనింగ్స్ తెచ్చిపెట్టింది. విడుదలైన అన్ని సెంటర్లతో పాటు విదేశాల్లో కాసుల వర్షం కురిపిస్తోంది ఈ సర్కారు వారి పాట. తొలివారంలో దాదాపు 85 శాతం రికవరీ వచ్చిందని, రెండో వారంలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసి లాభాల బాట పడుతుందని చెబుతున్నారు ట్రేడ్ పండితులు.
Published by:Sunil Boddula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.